యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఫిబ్రవరి 24 న మొదలు కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరుగుతుంది. బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ జోడిగా ఎంపిక చెయ్యడమే కాదు NTR30 లుక్ టెస్ట్ కోసం జాన్వీ కపూర్ ఫోటోషూట్ కూడా జరిగిపోయింది అని తెలుస్తుంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మూవీతోనే సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటున్నారు. ఇక కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ తో ఎలాంటి హడావిడి లేకుండా కూల్ గా సెట్స్ కి వెళ్ళబోతున్నారట. పూజా కార్యక్రమాలు ఈ నెల 24న జరిగినా.. రెగ్యులర్ షూట్ మాత్రం వచ్చే నెల 20 నుండి మొదలు పెట్టబోతున్నారు,
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా ఆదిపురుష్ రావణుడు అదేనండి సైఫ్ అలీఖాన్ నటించే ఛాన్స్ ఉంది, కొరటాల శివ పాన్ ఇండియా మార్కెట్ కోసం ముందు నుండి బాలీవుడ్ నటులనే విలన్ గా తేవాలని ఫిక్స్ అయ్యి.. ఇప్పుడు ఎన్టీఆర్ తో తలపడబోయే విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసారని తెలుస్తుంది. ఎన్టీఆర్ కి సైఫ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని.. వారి మధ్యన వచ్చే పోరాట సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.
భారీ బడ్జెట్ తో భారీగా మొదలు కాబోతున్న NTR30 పైనే అందరి చూపు. ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ఎంత ఆతృతగా ఉన్నారో చెప్పక్కర్లేదు. ఈ ఘడియ కోసం వారు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.