కరోనా సమయంలో ఓటిటీలు అందుబాటులోకి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే ఆలోచన తగ్గించుకోగా.. సామాన్య మానవుడు థియేటర్స్ కి వెళ్లి టికెట్ రేట్స్ తో బుక్ అవలేక ఓటిటీలకి అలవాటు పట్టాడు. 500 నుండి 1000 రూపాయలకే ఓటిటి ప్లాట్ ఫామ్స్ రీఛార్జ్ చేసుకుని ఏడాదంతా మూవీస్ ని వెబ్ సీరీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వారం వారం ఏ ఏ ఓటిటిలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి, ఏఏ వెబ్ సీరీస్ లు ఎందులో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి అనే ఆత్రుత ఓటిటి ఆడియన్స్ లో మొదలైంది.
మరి ఈవారం ఓటిటీలలో సందడి చెయ్యబోయే సినిమాలేవో చూసేద్దాం
అరవింద్ గారు ఆహా నుండి.. ఒకేరోజు మూడు సినిమాలు ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతున్నాయి.
సుధీర్ గాలోడు, సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం, సోహెల్ లక్కీ లక్ష్మణ్
నెట్ ఫ్లిక్స్ నుండి సర్కస్ హిందీ మూవీ
జీ 5 నుండి లాస్ట్ హిందీ సినిమా
హాట్ స్టార్ నుండి సదా నన్ను నడిపే సినిమాలు. ఇంకా వీటితో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ కూడా రేపు శుక్రవారం బోలెడన్ని.. వివిధ ప్లాట్ ఫామ్స్ నుండి అందుబాటులోకి రాబోతున్నాయి.