Advertisement
Google Ads BL

స్పెయిన్ లో ఏం చేస్తున్నావ్ మహేష్


గత నెలలో SSMB28 సెకండ్ షెడ్యూల్ లో పాల్గొన్న మహేష్ బాబు ఫిబ్రవరి 8 న స్పెయిన్ వెళ్లారు. ఆయనతో పాటు నమ్రత కూడా వెళ్లారని అనుకున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 10 మహేష్-నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ. అందుకే మహేష్ భార్య తో కలిసి స్పెయిన్ వెళ్లారని అనుకున్నారు. అలాగే ప్రేమికుల రోజు సెలెబ్రేషన్స్ కూడా మహేష్ అక్కడే చేసుకుంటారనే టాక్ నడిచింది. కానీ నమ్రత కానీ, పిల్లలు గౌతమ్, సితారలు ఎవరూ మహేష్ తో కలిసి వెళ్ళలేదు. అంటే మహేష్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లరనుకోవడానికి లేదు.

Advertisement
CJ Advs

ఎందుకంటే SSMB28 టీమ్ అంతా హైదరాబాద్ లోనే ఉంది. కేవలం మహేష్ ఒక్కరే స్పెయిన్ ఫ్లైట్ ఎక్కడంతో మహేష్ అభిమానుల్లో ఇప్పుడు కన్ఫ్యూషన్ మొదలయ్యింది. అటు ఫ్యామిలీ ట్రిప్ కాదు, ఇటు సినిమా షూటింగ్ కి కాకుండా మహేష్ స్పెయిన్ ఎందుకెళ్లారబ్బా అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఏమైనా హెల్త్ చెకప్ లాంటి వాటికీ మహేష్ స్పెయిన్ వెళ్ళారా అనే అనుమానంలో ఫాన్స్ ఉన్నారు. గతంలో మహేష్ స్పెయిన్ లోనే మోకాలి ఆపరేషన్ చేయించుకుని కొన్నాళ్ళు దుబాయ్ లో రెస్ట్ తీసుకున్నారు. సో మళ్ళీ దానికి సంబంధించిన చెకప్ కోసం ఏమైనా వెళ్లారేమో అనే ఆలోచనలోకి వస్తున్నారు అభిమానులు.

ఇక మహేష్ బాబు స్పెయిన్ నుండి రాగానే.. త్రివిక్రమ్ తదుపరి షెడ్యూల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ షెడ్యుల్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఆతృతగా ఉంది. ఇక మహేష్ కి విలన్ గా జగపతి బాబు కనిపిస్తారనే టాక్ నడుస్తుంది.

Mahesh, what are you doing in Spain?:

Mahesh Babu to fly to Spain
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs