నిన్నమొన్నటివరకు స్టార్ హీరోలంతా పూజా హెగ్డే జపమే చేసారు. అందుకే పూజా హెగ్డే కూడా గ్లామర్ షో చెయ్యడానికి, స్టార్ హీరోల సినిమా అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ దర్శకనిర్మాతలు బెంబేలెత్తించింది. పారితోషకం విషయమే కాదు, ఆమె వెంట వచ్చే అసిస్టెంట్స్ విషయంలోనూ నిర్మాతలు బెదిరిపోయేలా చేసింది. రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలు తెరకెక్కినప్పుడు పూజా హెగ్డే తన స్టాఫ్ ఖర్చులు నిర్మాతలే భరించాలంటూ ఒత్తిడి తెచ్చింది అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్. చేతి నిండా అవకాశాలతో కళకళలాడింది కాబట్టి నిర్మాతలు నోరెత్తలేదు.
కానీ గత ఏడాది నాలుగు డిజాస్టర్స్ మూవీస్. కనీసం ప్లాప్ కూడా కాదు ఏకంగా డిసాస్టర్ లిస్ట్ లోనే నిలిచాయి.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ లు. మూడు భాషల్లోనూ పూజా హెగ్డే కి షాక్ ల మీద షాక్ లే. తెలుగులో ప్రస్తుతం మహేష్ SSMB28 తప్ప ఇంకొకటి లేదు. హిందీలో సల్మాన్ ఖాన్ తో చేస్తున్న మూవీ తప్ప మరొకటి లేదు. తమిళంలో సరేసరి. అందుకే ఇప్పుడు పూజా హెగ్డే డిమాండ్ చేసే పరిస్థితిలో లేదంటున్నారు. నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునే స్టేజ్ కి వచ్చేసింది అనే టాక్ నడుస్తుంది.
గతంలో 3 నుండి 3.5 కోట్లు ముక్కుపిండి వసూలు చేసిన పూజ హెగ్డే.. ఇప్పుడు అర కోటి కాదు.. ఏకంగా కోటి తగ్గించుకుంటేనే అవకాశం అన్న రేంజ్ లో నిర్మాతలు ఉన్నారట. అయినా గత ఏడాది ఆమెకున్న ప్లాప్స్ చూసిన దర్శకనిర్మాతలు పూజా హెగ్డే కి అవకాశం ఇచ్చే ఆలోచన కూడా చెయ్యడం లేదని తెలుస్తుంది. ఒకప్పుడు ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగిన పూజ హెగ్డే ఇప్పుడు అలా బిజీగా లేకపోగా.. పారితోషకం విషయంలో అంతలా వెనక్కి తగ్గాల్సి రావడం చూసిన నెటిజెన్స్.. అయ్యయ్యో.. పూజ హెగ్డే పరిస్తితి ఏమిటి ఇలా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.