Advertisement
Google Ads BL

వైఫ్ తో నాగ శౌర్య ఫస్ట్ పిక్


నాగ శౌర్య గత ఏడాది నవంబర్ లో తాను ప్రేమించిన అనూష తో సింపుల్ గా ఫ్యామిలీ మెంబెర్స్, సన్నిహితుల మధ్యన ఏడడుగులు వేసాడు. నాగ శౌర్య పెళ్ళికి ముందు షూటింగ్ సెట్స్ లో సిక్ అయ్యి పడిపోగా ఆయన ఆసుపత్రిలో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తర్వాత నేరుగా పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్యన అంగరంగ వైభవంగా అనూష కి మూడు ముళ్ళు వేసాడు నాగ శౌర్య. అయితే తర్వాత హైదరాబాద్ లో నాగ శౌర్య తన భార్యని అపరిచయం చేస్తూ ఆయన ఫ్యామిలీ గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తుంది అనుకున్నారు. కానీ టాలీవుడ్ కి నాగ శౌర్య ఫ్యామిలీ నుండి ఎలాంటి ఆహ్వనాలేవి అందలేదు. దానితో అభిమానులు డిస్పాయింట్ అయ్యారు.

Advertisement
CJ Advs

అప్పటినుండి నాగ శౌర్య సైలెంట్ గా షూటింగ్ లోకి వెళ్ళిపోయాడు. ఈమధ్యనే నాగ శౌర్య నటించిన ఫలానా అమ్మాయి-ఫలానా అబ్బాయి టీజర్ రిలీజ్ కి నాగ శౌర్య బయట కనిపించాడు. కానీ ఆయన వైఫ్ తో నాగ శౌర్య ని పెళ్ళిలో చూడడమే.. తర్వాత చూసింది లేదు. అయితే తాజాగా అనూష పుట్టిన రోజు సందర్భంగా నాగ శౌర్య తన భార్య అనూషతో రొమాంటిక్ గా దిగిన పిక్ షేర్ చేసాడు. ఆ పిక్ లో అనూష అందంగా నుదుటిన బొట్టుతో భర్త కౌగిలిలో ఒదిగిపోయింది.

ఆర్కిటెక్చర్ అయిన కర్ణాటకకి చెందిన అనూషని నాగ శౌర్య పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

Naga Shaurya shares this cutest pic with his wife Anusha :

Naga Shaurya shares this cutest picture with his wife Anusha on her birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs