Advertisement
Google Ads BL

పవన్ అంటే ఇష్టం: జగపతి బాబు


సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, పలు భాషల్లో నెగెటివ్ రోల్స్ తో సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్ గా సక్సెస్ అయిన జగపతి బాబు బర్త్ డే రీసెంట్ గా జరిగింది. బర్త్ డే కి యూట్యూబ్ ఛానల్స్ కి స్పెషల్ ఇంటర్వూస్ ఇచ్చిన ఆయన కెరీర్ గురించే కాదు.. తన పర్సనల్ విషయాలని, పొలిటికల్ విషయాలను కూడా పంచుకున్నారు. 

Advertisement
CJ Advs

ఓ యాంకర్ మీకు ఏ హీరో ఇష్టమని అడిగితే.. తనకెవరు హీరోలన్నాఇష్టం లేరని చెప్పి.. హీరోయిన్స్ లో ఎవరు  ఇష్టమని అడిగితే.. పర్టిక్యులర్ గా ఒక్క హీరోయిన్ అని కాదు.. చాలామంది ఇష్టం. సౌందర్య అంటే మంచి ఫ్రెండ్, అలాగే సహా నటి. ఇక రమ్యకృష్ణ కూడా అంతే మంచి ఫ్రెండ్. చెప్పుకుంటూ వెళితే ఇలా చాలామంది ఉన్నారు. కానీ హీరోల్లో నాకు ఈ హీరో ఇష్టమని లేదు అని టక్కున చెప్పారు.

ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలు ఇష్టం. సినిమాలు చేస్తూ పాలిటిక్స్ లోకి వెళ్లిన వాళ్లలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అంతేకాని.. హీరో గా కాదు అంటూ జగపతి జవాబిచ్చారు. ఇక కెరీర్ లో ఏ డైరెక్టర్ అంటే ఇష్టమని అడిగితే రాజమౌళి విజన్ అంటే ఇష్టమని చెప్పిన జగపతి బాబు ప్రొడ్యూసర్స్ విషయంలో ఏ ఒక్కరి పేరు చెప్పకపోవడం గమనార్హం. అదేమిటి మీ తండ్రిగారి గారు రాజేంద్రప్రసాద్ గారు మంచి నిర్మాత కారా.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకి.. నా వరకు కాదనే చెబుతానని అన్నారు.

Jagapathi Babu comments on Pawan Kalyan:

Jagapathi Babu words on Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs