Advertisement
Google Ads BL

రామ్ చరణ్ నుంచి మెగా పవర్ ట్రీట్


రామ్ చరణ్-టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో క్రేజీ ప్రాజెక్ట్ గా మూడు భాషల్లో తెరకెక్కుతున్న RC15 షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పాత బస్తి, కర్నూల్ కొండా రెడ్డి బురుజు వద్ద సాంగ్ చిత్రీకరణ జరిపిన శంకర్ ఇప్పుడు RC15 షూటింగ్ ని వైజాగ్ కి షిఫ్ట్ చేసారు. హైదరాబాద్, కర్నూల్ లలో చిత్రీకరించిన సాంగ్ మిగతా భాగం వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. RC15 సెట్స్ నుండి ఈ సాంగ్ షూట్ కి సంబందించిన కొన్ని పిక్స్ లీకైయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇది మెగా పవర్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య వీరయ్య కటౌట్ ముందు రామ్ చరణ్ నిలబడి కనిపిస్తున్నాడు. ఇంద్రలో మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పు వేస్తున్న రామ్ చరణ్, ఇప్పుడు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కటౌట్ ముందు డాన్స్ చేస్తే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అంతే కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ స్టైల్‌తో రెడ్ టవల్‌తో డాన్స్ చేస్తాడని ఊహించుకుంటున్నారు ఫాన్స్. 

ఈ ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ కలిపి ఓ పాట కోసం దర్శకుడు శంకర్ ప్లాన్ చేసారు. ఈ సాంగ్ వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ న్యూస్ వింటుంటేనే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటే.. థియేటర్స్ లో చూస్తే ఇంకెంత రచ్చ చేస్తారో.. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరిస్తున్న ఈ పాటను ఈరోజు ఆర్కే బీచ్‌ చిత్రీకరణతో ముగించనున్నారు

Mega Power Treat From Ram Charan:

Ram Charan To Show Mega Power Mass In RC 15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs