కొరటాల శివ-ఎన్టీఆర్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కాల్సిన మూవీ ఒక ఏడాది డైలమాలో ఉండి.. ఫైనల్ గా ఈనెలలో మొదలు పెట్టడానికి ముహూర్తం కుదిరింది. ఆ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ కంగారు పడినా.. ఇప్పుడు బయటికి చూపించుకోలేక ఆగుతున్నారు. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమిగోస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆవేశపడకుండా ఆగుతున్నారు.
అయితే ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్‌లో NTR30 కి ముహూర్తం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో మొదలు పెడతామని చెప్పినట్టుగానే.. దానికి తగ్గ ఏర్పాట్లు మేకర్స్ చేస్తున్నారు. NTR30 పూజా కార్యక్రమాలను పాన్ ఇండియా లేవల్లోనే అందరికి రిజిస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పిలిచి.. ఇంకా కొంతమంది స్టార్లకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ నుండి దించే ప్లాన్ లో ఉండగా.. హీరోయిన్ గా మాత్రం జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక పూజా కార్యక్రమాలు ఈ నెలలో మొదలైనా.. మార్చి నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.