రాజస్థాన్ లోని జైసల్మార్ సూర్యఘడ్ కోట లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు పెళ్లి అయిన దగ్గర నుండి మీడియాలోనే కనబడుతున్నారు. రాజస్థాన్ కోటలో పెళ్లి, తర్వాత ముంబై కి తిరిగి వచ్చిన కొత్త జంట ఢిల్లీ వెళ్ళింది. అక్కడి నుండి ముంబై చేరుకొని బాలీవుడ్ సెలబ్రిటీస్ కి గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చింది. అలియా భట్ దగ్గర నుండి వరుణ్ ధావన్ వరకు, కరణ్ జోహార్ నుండి కరీనా కపూర్ వరకు అందరూ ముంబై లో జరిగిన ఈ రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు.
ఇక పెళ్లి, రిసెప్షన్ జరిగిందో, లేదో ఇలా ప్రేమికుల రోజు రానే వచ్చేసింది. పెళ్లి బట్టల్లోనే రొమాంటిక్ గా ముద్దులతో రెచ్చిపోయిన ఈ జంట వాలెంటైన్స్ డే రోజున కూడా రొమాంటిక్ ఫోజులతో అదరగొట్టేసారు. సిద్దార్థ్ మల్హోత్రాకు ముద్దు పెడుతూ కియారా తమకంతో మునిగిపోయింది. ఆ ఫొటోస్ కూడా వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగమే అయినా.. ఈ వాలంటైన్స్ డే రోజున షేర్ చెయ్యడంతో అవి మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కియారా-సిద్దార్థ్ మల్హోత్రాల జంట మూడేళ్ళ సీక్రెట్ ప్రేమని పెళ్లి బంధంతో ముడివేసుకుంది. ఇలా పెళ్లి, రిసెప్షన్ అన్ని ఆర్భాటంగా చేసుకున్నారు. పెళ్లి జరిగి వారమైనా ఇంకా ఇంకా సోషల్ మీడియాలో కియారా-సిద్దార్థ్ ల పిక్స్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతూనే ఉన్నాయి.