Advertisement
Google Ads BL

ఏం చేసినా విజయ్ తోనే లింకా?


రష్మిక మందన్న ఏం చేసినా నెటిజెన్స్ విజయ్ దేవరకొండ ని లింక్ చేసేసి వీళ్ళ మధ్యన ఏదో ఉంది అని క్రియేట్ చేసుకుని మరీ ఊహించుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకంటే రష్మిక- విజయ్ లు చేసేది కరెక్ట్ అని చెప్పలేము. ఎంత ఫ్రెండ్స్ అయినా వెకేషన్స్ కి తరుచూ వెళుతూ పిక్స్ షేర్ చేస్తారా.. అనేది నెటిజెన్స్ వాదన. ఫ్రెండ్స్ అయితే రెస్టారెంట్స్, లంచ్, పార్టీలు, పబ్బులు, డిన్నర్ లు లాంటివి సహజం.. కానీ ఈ వెకేషన్స్ మేటర్ అర్ధం కావడం లేదు అంటారు. అందుకే రష్మిక, విజయ్ ఏం చేసినా ఎంత చెప్పినా వినరు, వినిపించుకోరు. 

Advertisement
CJ Advs

తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది. అదిగో అది విజయ్ దేవరకొండ ని ఉద్దేశించే అంటున్నారు. నన్ను ప్రేమించే అందరికి ప్రేమికుల రోజు దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో లో తన పెంపుడు కుక్కతో రష్మిక ఆడుకుంటుంది. అలా రష్మిక ప్రేమికుల రోజున విష్ చేసిందో, లేదో.. ఏంటి విజయ్ దేవరకొండకి చెప్పావా అంటూ ఆమె అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

అదలా ఉంటె.. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో యానిమల్ షూటింగ్, టాలీవుడ్ లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా వుంది. 

Valentines Day: Rashmika shares an adorable video:

Rashmika Mandanna wishes fans on Valentine day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs