Advertisement
Google Ads BL

అనుష్క కి అలాంటి వ్యాధా..


స్వీటీ అనుష్క శెట్టి భాగమతి, నిశ్శబ్దం తర్వాత నిజంగానే నిశ్శబ్దంగా మారిపోయింది. సైజు జీరో కష్టాలు అనుష్కని నిద్రపోనివ్వడం లేదు. ఆ వెయిట్ తగ్గించుకోలేక సినిమాలకి దూరమైంది. నవీన్ పోలిశెట్టి తో అనుష్క సినిమా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అనుష్క చెఫ్ గా కనిపించబోతుంది. అయితే బరువు తగ్గేందుకు అనుష్క చెయ్యని ప్రయత్నం లేదు. ఈజీగా పెంచిన బరువుని.. ఎంత గించుకున్నా తగ్గించేలేక అనుష్క నానా పాట్లు పడుతుంది. అయితే తాజాగా అనుష్క తనకో జబ్బు ఉంది అంటూ తమిళ మీడియాలో చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.

Advertisement
CJ Advs

అసలే ఈ మధ్యన రోజుకో హీరోయిన్ తనకి అలాంటి జబ్బు ఉంది, ఇలాంటి వ్యాధి సోకింది అని చెప్పడం చూసిన నెటిజెన్స్ కూడా అనుష్కకి ఏమైందో ఏమిటో అనుకుని కంగారు పడ్డారు కానీ.. అనుష్క తనకొచ్చిన జబ్బు చెబితే.. అవునా ఇదేనా ఆమె వ్యాధి అనేస్తారు. ఇంతకూ అనుష్కకి ఉన్న ఆ వ్యాధి ఏదో కాదు.. నవ్వడం అంట. తనకి నవ్వొస్తే దాదాపుగా 15 నుండి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటాను, అదే తనకున్న సమస్య అంటూ అనుష్క చెప్పిన మాట విని అందరూ షాకవుతున్నారు.

నవ్వించే ఘటన వస్తే పడి పడి నవ్వేస్తాను, సెట్ లో నేను నవ్వడం మొదలు పెడితే షూటింగ్ కూడా ఆపెసుకోవాల్సిందే. దాదాపుగా 20 నిముషాలు అదే పనిగా నవ్వుతాను. నేను నవ్వే గ్యాప్ లో ప్రొడక్షన్ వాళ్ళు స్నాక్స్, టిఫిన్స్, టీ తాగేసి వచ్చేస్తారు అంటూ అనుష్క తన వ్యాధిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Anushka is suffering from laughter disease:

Anushka Shetty who has that rare disease
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs