Advertisement
Google Ads BL

సిద్దార్థ్ కి షాకిచ్చిన అదితి రావు


హీరో సిద్దార్థ్ - హీరోయిన్ అదితి రావు హైదరి ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈమధ్యలో ముంబైలో ఓ రెస్టారెంట్ లో కలిసి తిరగడం.. శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కలిసి కనిపించడంతో.. వారిమధ్యన ప్రేమ ఉందనే ఊహల్లోకి వెళ్లిపోయారు జనాలు. సిద్దు కూడా అదితి పుట్టిన రోజుకి లవ్లీ గా స్వీట్ గా విషెస్ చెప్పడం అవన్నీ సోషల్ మీడియాలో జనాలు గమనిస్తూనే ఉన్నారు. సీక్రెట్ గా డేటింగ్ ని మెయింటింగ్ చేస్తున్న వీరు త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారేమో అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ప్రేమికుల రోజు. అదితి సిద్దార్థ్ కి ప్రపోజ్ చేస్తుందేమో అని చాలామంది తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ అదితి రావు ఇక్కడ బాలీవుడ్ సీనియర్ హీరో ఒకరికి ప్రపోజ్ చెయ్యడం సిద్దుకే కాదు ఆయన అభిమానులకి షాకిచ్చింది. ముంబై లో వాలెంటీటైన్స్ డే రోజు జరిగిన ఓ ఈవెంట్ లో అదితి రావు హిందీ సీనియర్ హీరో ధర్మేంద్రకి రెడ్ గులాబీ ఇచ్చి ప్రపోజ్ చెయ్యడం హైలెట్ అయ్యింది.

అదితి అలా సరదాగా ధర్మేంద్రకి ప్రపోజ్ చేసిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ చూసిన సిద్దార్థ్ కూడా రియాక్ట్ అవడం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది. 2 హార్ట్ ఎమోజిలతో సిద్దు ఆ ఫోటో కి రియాక్ట్ అయ్యాడు. అది చూసిన నెటిజెన్స్ అయ్యయ్యో సిద్దు ఎంతపని జరిగింది. అదితి నీకు ప్రపోజ్ చేస్తుంది అనుకుంటే ఈ సీనియర్ కి ప్రపోజ్ చెయ్యడం ఏమిటి గురూ అంటూ కామెంట్ చేస్తున్నారు.  

Aditi Rao shocked Siddhartha:

Aditi Rao Hydari Proposes To Dharmendra On Valentine Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs