Advertisement
Google Ads BL

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కి ఏమైంది


పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ అందరికి సుపరిచితురాలు. మెగా హీరో పవన్ కళ్యాణ్ తో పెళ్లి పీటలెక్కకముందే పవన్ తో కలిసి సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తో సరిపోక విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటుంది. మధ్యలో రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయం హైలెట్ అయినా.. రేణు ఎందుకో మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. పిల్లలని పెంచుతూ అటు డైరెక్షన్ లోకి దిగింది. ఇక రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీలో కీలక పాత్ర చేస్తున్న రేణు దేశాయ్ తానొక డిసీస్ తో బాధపడుతున్నట్టుగా ఇన్స్టా లో పోస్ట్ చేసింది.

Advertisement
CJ Advs

నేను గత కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో పోరాడుతున్నాను, వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే.. పాజిటివ్ నెస్ తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. వారిలో ధైర్యాన్ని నింపేందుకే నేను ఈ పోస్ట్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, ఏదో ఒకరోజు మన పోరాటానికి తగిన ఫలితం లభిస్తుంది. నాకు ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. మెడిసిన్స్ తీసుకుంటున్నాను.

అంతేకాకుండా యోగ చేస్తున్నాను, మంచి ఆహారం తీసుకుంటున్నాను, త్వరలోనే కోలుకుని షూటింగ్స్ లో పాల్గొంటాను అంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.  

What happened to Pawan ex-wife Renu Desai?:

<span>Renu Desai Suffering With Heart Disease</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs