Advertisement
Google Ads BL

పారితోషకం త్యాగం చేస్తున్న ప్రభాస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇకమీదట పాన్ ఇండియా కథలనే, స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చెయ్యాలని అభిమానులు కోరుకోవడం సహజం. కానీ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటూ ఆయన ఫాన్స్ అల్లాడిపోతున్నారు. బాహుబలి తర్వాత సుజిత్ తో సాహో, రాధాకృష్ణ తో రాధేశ్యామ్ సినిమాలు చేసారు ప్రభాస్. అనుభవం లేని దర్శకులు పాన్ ఇండియా కథలని హ్యాండిల్ చెయ్యడంలో తడబడ్డారు. ఇప్పుడు స్టార్ దర్శకులతో పాన్ ఇండియా సినిమాల్ని చేస్తూ విపరీతమైన హైప్ తో ఉన్న సమయంలో ప్రభాస్ దర్శకుడు మారుతీ తో సినిమా చెయ్యడం ఆయన ఫాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు.

Advertisement
CJ Advs

ఫాన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా ప్రభాస్ మారుతీ తో సినిమా మొదలు పెట్టేసారు. రాజా డీలక్స్ అంటూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా ఉంటారో ఏమో అనే ఆందోళన అభిమానుల నుండి తొలిగిపోవడం లేదు. అయితే ప్రభాస్ కి ఈ కథ బాగా నచ్చేసిందట. అందుకే ఎవరు చెప్పినా వినకుండా ఆ ప్రాజెక్ట్ ఓకె చేసేసారట. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఏమి తీసుకోవడం లేదట. కారణం ఈ చిత్ర బడ్జెట్ పరిమితులు దాటకుండా ప్రభాస్ రెమ్యునరేషన్ త్యాగం చేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

పరిమిత బడ్జెట్ లో టాలీవుడ్ ఆడియన్స్ కి మంచి కథని అందించాలనే తపనతోనే ప్రభాస్ ఈనిర్ణయం తీసుకున్నారని అంటుంటే.. అసలు అంతగా ఆ స్టోరీ లో నీకేం నచ్చింది ప్రభాస్ అంటూ ఫాన్స్ క్వచ్చన్ చేస్తున్నారు. మరి పారితోషకం కూడా త్యాగం చేసేంత నిజంగానే మారుతి ప్రభాస్ ని ఏం మాయ చేసాడో చూద్దాం.

Prabhas is sacrificing remuneration:

Prabhas charges zero remuneration for Maruthi Raja Deluxe?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs