Advertisement
Google Ads BL

లేడీ సూపర్ స్టార్ ఫాన్స్ కి భయపడ్డ మాళవిక


మాళవిక మోహన్ ఈమధ్యన సినిమా ఆఫర్స్ కన్నా ఎక్కువగా నయనతారని విమర్శించడంతోనే హైలెట్ అవుతుంది. అప్పుడెప్పుడో నయనతార మేకప్ పై కామెంట్స్ చేసింది. దానికి నయనతార కూడా దిమ్మతిరిగే కౌంటర్ వేసింది. అయినా మాళవిక మోహన్ మాత్రం నయనతారని విమర్శించడం మానలేదు. నయనతారని టార్గెట్ చేస్తే ఫెమస్ అవుతాను అనుకుంటుందో ఏమో.. అవకాశం దొరికితే చాలు నయనతారపై పడుతుంది. అయితే అన్నివేళలా అభిమానులు ఊరుకోరు. తాట తీస్తారు. ఇప్పుడు అదే జరిగింది. నయనతార ఏమో కానీ ఆమె అభిమానుల దెబ్బకి మాళవిక మోహన్ దారికొచ్చింది. 

Advertisement
CJ Advs

నయనతారని లేడీ సూపర్ స్టార్ అనడం నాకు నచ్చదు, హీరోయిన్స్ ని సూపర్ స్టార్స్ అంటే చాలు మళ్ళీ లేడీ సూపర్ స్టార్ అనక్కర్లేదు. బాలీవుడ్ లో కరీనా, అలియా భట్, దీపికలని సూపర్ స్టార్స్ అంటారు కానీ లేడీ సూపర్ స్టార్స్ అనరు అంటూ నయనతారపై మాళవిక మోహన్ చేసిన కామెంట్స్ పై నయన్ అభిమానులు భగ్గుమన్నారు. నయనతార స్టార్ డమ్ చేసి ఓర్వలేకపోతున్నావా, ప్రతిసారి నయన్ పేరు వాడుకుని హైలెట్ అవుదామనుకుంటున్నావా అంటూ మాళవిక మోహన్ ని నయన్ ఫాన్స్ ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు.

దానితో దెబ్బకి దెయ్యం దిగినట్టుగా నయన్ ఫాన్స్ చేసే రచ్చతో మాళవిక మోహన్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ.. హీరోయిన్స్ విషయంలో నా అభిప్రాయాన్ని చెప్పాను, నేను ఓ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ అనలేదు, నిజానికి నాకు నయనతార అంటే ఇష్టం, ఆమెని నేను గౌరవిస్తాను, సీనియారిటీ ఉన్న ఆమెని చూసి ఇన్స్పైర్ అవుతాను, కాబట్టి అందరూ కాస్త శాంతించండి అంటూ మాళవిక మోహన్ ఆల్మోస్ట్ క్షమాపణలు చెప్పినంత పని చేసింది.

Nayanthara fans troll on Malavika Mohanan:

Malavika Mohanan clarifies she didn’t take a dig at Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs