Advertisement
Google Ads BL

నయన్ పై పడి ఏడుస్తున్న హీరోయిన్


లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంటే ఎవ్వరికైనా కుళ్ళు ఉంటుంది. ఉక్రోషం ఉంటుంది. హీరోయిన్ గా మారాక స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ ఇప్పటికీ తీరిక లేకుండా సినిమాలు చేస్తూ మొదటిసారి బాలీవుడ్ లో షారుఖ్ తో కలిసి సినిమా చేస్తున్న నయనతారని చూస్తే కుళ్ళు ఉన్నా అది బయటికి ఎవరూ ఎక్ష్ప్రెస్స్ చెయ్యరు. కానీ ఇప్పుడో యంగ్ హీరోయిన్ నయనతారపై పడి ఏడుస్తుంది అనిపించేలా ఆమె చేష్టలు ఉన్నాయి.

Advertisement
CJ Advs

కోలీవుడ్ లో స్టార్ హీరోస్ విజయ్, ధనుష్ తో కలిసి నటించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేని మాళవిక మోహన్ కి సోషల్ మీడియాలో మాత్రం యమా క్రేజ్ ఉంది. మాళవిక మోహన్ గతంలో నయనతార పై హాట్ కామెంట్స్ చేసింది. ఓ సినిమాలో ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు కూడా ఓ టాప్ హీరోయిన్ మేకప్ వేసుకుంది అంటూ పరోక్షంగా నయనతారని విమర్శించింది. దానికి నయనతార రీసెంట్ గా కౌంటర్ ఇచ్చింది. నన్నొక హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై మేకప్ వేసుకుని రియలిస్టిక్ గా లేనని విమర్శించింది. కానీ కమర్షియల్ సినిమాలకి ఏం కావాలో దర్శకులకి తెలుసు మనం చెప్పక్కర్లేదు అంటూ మాళవికకి ఇండైరెక్ట్ గా చురకలు అంటించింది.

అయితే మరోసారి మాళవిక మోహన్ నయన్ పై చేసిన కామెంట్స్ చూస్తే ఈమేంటి తరుచూ నయనతారపై పడుతుంది అనుకునేలా ఉన్నాయి. తాజాగా ఓ యాంకర్ లేడీ సూపర్ స్టార్ నయన్ పై మీ అభిప్రాయం ఏమిటి అనగానే మాళవిక మోహన్ గబగబా ముందుకొచ్చి లేడీ సూపర్ స్టార్ అంటే తనకి నచ్చదని, హీరోయిన్స్ ని సూపర్ స్టార్స్ అంటే చాలు, లేడీ సూపర్ స్టార్ అనక్కర్లేదు, బాలీవుడ్ లో దీపికా పదుకొనె, కత్రినా, అలియా లాంటి వాళ్ళని సూపర్ స్టార్స్ అంటారు కానీ లేడీ సూపర్ స్టార్స్ అనరు.. అంటూ మాళవిక చేసిన వ్యాఖ్యలతో నయన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

మాళవికకి ఎందుకు నయనతారని చూస్తే అంత కడుపు మంట. ఎప్పటికప్పుడు మా నయన్ పై పడి ఏడుస్తుంది అంటూ మాళవిక మోహన్ ని తిట్టు పోస్తున్నారు.

Malavika Mohanan Took Dig At Lady Superstar Nayanthara Again?:

Malavika Mohanan clarifies she didn’t take a dig at Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs