Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో రెడ్ కార్పెట్- కానీ టాలీవుడ్ లో..


ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సమంత నాగ చైతన్య తో పెళ్లి తరవాత ఆమెకి స్టార్ హీరోల అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దానితో ఆమె గ్లామర్ షో చేస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పని చేసిన సమంతకి పెళ్లి తర్వాత నిజంగానే అవకాశాలు తగ్గాయి. స్టార్ ఫ్యామిలీ కోడలికి గ్లామర్ షో చేసే రోల్స్ ఇస్తే కష్టమని భయపడి ఎవరూ ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు అనే టాక్ నడించింది. 

Advertisement
CJ Advs

అయితే ఆ విషయంలోనే సమంత హార్ట్ అయ్యి బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2లో బోల్డ్ గా రెచ్చిపోయింది. ఆతర్వాత చైతూ తో విడాకులు అయ్యాయి. కారణం ఆమె గ్లామర్ షోకి చైతు నో చెప్పడమే అన్నారు. అలాగే సమంత కూడా తనకొచ్చే అవకాశాలు మ్యారేజ్ లైఫ్ వలన చేజారిపోతున్నాయనే ఫీలయ్యింది అనుకున్నారు. ఇక విడాకులు అయ్యాయో లేదో అల్లు అర్జున్ పుష్ప లో ఎవ్వరూ ఊహించని గ్లామర్ చూపిస్తూ ఐటెం సాంగ్ చేసింది. ఈ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ మాత్రమే చేస్తున్న సమంతకి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అక్కడ యంగ్ హీరోలే ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో వెబ్ సీరీస్ చేస్తుంది. అది కూడా గ్లామర్ గా ఉండే రోల్ అని తెలుస్తుంది. 

ఇంకా కొన్ని అవకాశాలు బాలీవుడ్ నుండి వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడి స్టార్ హీరోయిన్ కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంటే.. టాలీవుడ్ హీరోలు మాత్రం ఆమెని లైట్ తీసుకుంటూ పక్కన పెట్టెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె అభిమానుల వాదన.

Red carpet in Bollywood- But Tollywood..:

Samantha busy in Bollywood offers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs