Advertisement
Google Ads BL

తెగ ఎగ్జైట్ అవుతున్న తమన్నా


మిల్కి బ్యూటీ ప్రస్తుతం సీనియర్స్ లిస్ట్ లోకి చేరింది.. తమన్నా ఎంతగా అందాలు ఆరబోస్తూ గ్లామర్ షో చేసినా యంగ్ హీరోలు పట్టించుకోవడం మానేశారు. దానితో  సీనియర్ హీరోలకి కనెక్ట్ అవుతున్న తమన్నా తెలుగులో భోళా శంకర్ లో మెగాస్టార్ చిరంజీవి తో రొమాన్స్ చేస్తుంది. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ జైలర్ లో రజినీకాంత్ తో రొమాన్స్ చేస్తుంది. ఒకేసారి మెగాస్టార్-సూపర్ స్టార్ సినిమాల్లో అవకాశాలు రావడంతో తమన్నా తెగ ఎగ్జైట్ అవుతుంది. రీసెంట్ గా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ..

Advertisement
CJ Advs

రజిని సర్ పక్కన నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ రోజు నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యింది. ఆయన్ని మొదటిరోజు సెట్ లో చూసేందుకు చాలా ఎగ్జైట్ అయ్యాను, ఇక గతంలో మెగాస్టార్ చిరుతో సైరా నరసింహారెడ్డి మూవీలో నటించాను. కానీ మళ్ళీ భోళా శంకర్ లో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కడం నా అదృష్టమే. చిరుతో డాన్స్ చేసేందుకు చాలా ఆతృతగా ఉన్నాను.. అంటూ సూపర్-మెగాస్టార్ చిత్రాలపై తమన్నా తన ఎగ్జైట్మెంట్ ని అందరితో పంచుకుంది.

ఇవే కాకుండా తమన్నా మలయాళంలో ఓ మూవీ, ఇంకా వెబ్ సీరీస్ ల్లో కూడా నటిస్తూ బిజీగా గడిపేస్తుంది.

Tamannaah is getting excited:

Tamannaah Bhatia opens up about films with Chiranjeevi, Rajinikanth 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs