Advertisement
Google Ads BL

తమన్నా ఎంగేజ్మెంట్ నిజమేనా?


మరో నాలుగు రోజుల్లో తమన్నా ముంబై నటుడు విజయ్ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది అనే న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. తెలుగు వాడే అయినా హిందీ సినిమాల్లో నటిస్తూ తెలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న విజయ్ వర్మతో మిల్కి బ్యూటీ ఎప్పటినుండో డేటింగ్ లో ఉంది. అది సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తుంది అనే న్యూస్ కొద్దిరోజులుగా స్ప్రెడ్ అయ్యింది. న్యూ ఇయర్ పార్టీలో వీరి స్నేహం, బంధం అన్ని ఆల్మోస్ట్ రివీల్ అయ్యాయి. కానీ తమన్నా, విజయ్ వర్మలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోనట్టే ఉండిపోతున్నారు

Advertisement
CJ Advs

అయితే ఈమధ్యన ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున తమన్నా-విజయ్ వర్మల ఎంగేజ్మెంట్ జరగబోతుంది, అది కూడా కుటుంబ సభ్యుల మధ్యన ముంబైలో నిరాడంబరంగా జరిపేందుకు ఇరు ఫామిలీస్ సన్నాహాలు చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తమన్నా సైడ్ నుండి, విజయ్ వర్మ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. తమన్నా ఏమో హైదరాబాద్ లో  షాప్ ఓపెనింగ్స్, అలాగే భోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. అటు విజయ్ వర్మ ముంబైలో షూటింగ్స్ తో బిజీగా వున్నాడు.

అందుకే నెటిజెన్స్ అసలు తమన్నా ఎంగేజ్మెంట్ నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. లేకపోతే బాలీవుడ్ నటులు లాగ చెప్పకుండా పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇస్తారా ఏమిటి అనే అనుమానాలు వెలిబుచ్చుతున్నారు.

Is Tamannaah engagement real?:

Tamannaah Bhatia is reportedly dating Vijay Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs