Advertisement
Google Ads BL

మరోసారి త్రివిక్రమ్ లేకుండానే.. పవన్


పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారనే ఆసక్తితో పవన్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ దగ్గర నుండి వేరు వేరు దర్శకులతో సినిమాలు మొదలు పెట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒప్పుకునే సినిమాల్లో ఎక్కువ శాతం త్రివిక్రమ్ సజెస్ట్ చేసినవే. వకీల్ సాబ్ వెనుక, భీమ్లా నాయక్ వెనుక త్రివిక్రమ్ ఉండి నడిపించిన సినిమాలే. హరీష్ తో, క్రిష్ తో, సుజిత్ తో చేసే సినిమాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదలు పెట్టవబోయే మరో ప్రాజెక్ట్ వెనుక కూడా గురుజీనే ఉన్నారు. అన్ స్టాపబుల్ టాక్ షోలో త్రివిక్రంతో ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది అని బాలయ్య అడిగితే.. ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ ఆసక్తికర సమాధానం  ఇచ్చారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ తో సముద్రఖని చెయ్యబోయే తమిళ రీమేక్ వినోదయ సితం వెనుక త్రివిక్రమ్ ఉన్నారు. ఆయన స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసే కథకి సముద్రఖని డైరెక్టర్ అట. అయితే వినోదయ సితం యాజిటీజ్ గా రీమేక్ చెయ్యకుండా తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా, పవన్ కళ్యాణ్ కేరెక్టర్ రూపురేఖలని త్రివిక్రమ్ మొత్తం మార్చేసారట. వినోదయ సితం సోల్ తీసుకుని.. మొత్తం కథని-పవన్ ఎక్కువగా హైలెట్ అయ్యేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలయికలో ఓ సాంగ్, డైలాగ్స్, పవన్ లుక్స్ అన్ని త్రివిక్రమ్ స్టయిల్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఇక హీరోయిన్ గా కేతిక శర్మ సాయి తేజ్ కి జోడిగా కనిపించబోతున్న ఈ వినోదయ సితం రీమేక్ త్వరలోనే పూజా కార్యక్రమాలు చేసుకోవానికి రెడీ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మరోసారి త్రివిక్రమ్ లేకుండానే సినిమా చేస్తున్నారన్నమాట. ఇక ఈ సినిమాకి పవన్ కి షాడోలా త్రివిక్రమ్ ఉంటున్నారు అది వేరే విషయం.

Once again without Trivikram.. Pawan:

Tamil film Vinodhaya Sitham with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs