బుల్లితెర మీద నుండి అనసూయ తప్పుకుంది. జబర్దస్త్ షో అలాగే మిగతా షోస్ కి అనసూయ యాంకరింగ్ చెయ్యడం లేదు, ఆమె సిల్వర్ స్క్రీన్ పై బిజీ అవడంతో ఆల్మోస్ట్ బుల్లితెర మీద కనిపించడం మానేసింది. దానితో శ్రీముఖి అనూహ్యంగా క్రేజీ యాంకర్ గా మారిపోయింది. ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా శ్రీముఖి నే కనబడుతుంది. ఫెస్టివల్ ప్రోగ్రాం కాదు, స్పెషల్ షోస్ కాదు, వారం వారం వచ్చే షోస్ కాదు.. ఎందులో చూసినా ఆమె ఉంటుంది. స్టార్ మా, జీ తెలుగు, జెమినీ, ఈటివి ఇలా అన్ని ఛానల్స్ ని కవర్ చెయ్యడమే కాకుండా అందుకు తగ్గ గ్లామర్ షో కూడా మొదలు పెట్టింది.
ఈటీవీలో మిస్టర్ అండ్ మిస్సెస్ షోకి యాంకరింగ్ చేస్తూ మోడ్రెన్ గా అందాలు ఆరబోస్తుంది. ఇక స్టార్ మా BB జోడిలో అయితే మరింతగా గ్లామర్ డోస్ పెంచేసింది. గత ఏడాది కాలంలో శ్రీముఖి చాలా మారింది. రోజు రోజుకి ఆమె గ్లామర్ షో మరింత ఎక్కువైపోతోంది. క్లివేజ్ షో, థై షో అంటూ శ్రీముఖి బుల్లితెర మీద చేసే స్కిన్ షో మాములుగా లేదు. కాస్త బరువు తగ్గిన శ్రీముఖి గ్లామర్ మీద బాగా కాన్సంట్రేట్ చేసింది. వెండితెర మీద ఎప్పుడో వచ్చే అవకాశాన్ని నమ్ముకోవడం వేస్ట్ అన్న రేంజ్ లో పాప బుల్లితెరపై ఫిక్స్ అయ్యింది.
మరోపక్క శ్రీముఖి గ్లామర్ డ్రెస్ లపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. థై షో చేసేటప్పుడు కొద్దిగా చూసుకో శ్రీముఖి అంటున్నారు. మరీ అంతలా రెచ్చిపోవక్కర్లేదు, టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని సలహాలు కూడా ఇస్తున్నారు.