Advertisement
Google Ads BL

నయన్ కి కోపం-ఆ హీరోతో ఇకపై నటించదా?


నయనతార ఇప్పుడు కోపంతో రగిలిపోతుందా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ మీడియా సర్కిల్స్ నుండి వినిపిస్తుంది. భర్త విగ్నేష్ శివన్ ని మోసం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో అంటే నయన్ కి బాగా మండుతుందట. అసలు విషయం ఏమిటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో నయన్ భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తో లైకా ప్రొడక్షన్ లో ఓ సినిమా కమిట్ అవడమే కాదు, అఫీషియల్ గా ప్రకటన కూడా వచ్చేసింది. తెగింపు మూవీ రిజల్ట్ తర్వాత అజిత్.. విగ్నేష్ శివన్ తో చెయ్యాల్సిన AK62 విషయంలో వెనక్కి తగ్గారట.

Advertisement
CJ Advs

అజిత్ కి, లైకా వారికి విగ్నేష్ చెప్పిన కథ నచ్చకపోవడం, అలాగే విగ్నేష్ శివన్ విషయంలో ఇరువురు లైట్ తీసుకోవడంతో విగ్నేష్ శివన్ సైలెంట్ గా ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేసాడు. ఆ విషయంలో నయనతార బాగా హార్ట్ అయ్యిందట. అందుకే ఇకపై అజిత్ తో నటించను అని ఆమె నిర్ణయం తీసుకుందట. ఎన్ని కోట్ల పారితోషకం ఇస్తాను అన్నా నయనతార మాత్రం అజిత్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు స్టార్ట్ అయ్యాయి. 

అజిత్-నయనతారది హిట్ కాంబినేషన్. వారిద్దరూ మూడు సినిమాల్లో నటించారు. నయన్ గనక అజిత్ తో సినిమాల్లో కనిపించక పొతే అటు అజిత్, ఇటు నయనతార అభిమానులు ఇద్దరూ ఫీలైపోవడం ఖాయం.

Angry Nayanthara to take a shocking decision:

Nayanthara not to forgive this star
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs