Advertisement
Google Ads BL

పవన్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డారట


పవన్ కళ్యాణ్ ఆహా టాక్ షో బాలయ్య అన్ స్టాపబుల్ కి వస్తున్నారనగానే ఆయన ఫాన్స్ లో ఆనందం ఒక పక్కన మరోపక్క ఆశ్చర్యం. పొలిటికల్ మీటింగ్స్, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండి పవన్ కళ్యాణ్ ఆహా టాక్ షోకి వస్తున్నారంటే ఆశ్చర్య పోవడం కాదు, అసలు ఆయన ఓ టాక్ కి రావడం అనేది నిజంగా షాకింగ్ విషయమే మరి. అంత సిగ్గు, మొహమాటస్తుడు ఆయన. అందులో బాలయ్య ఎదురు పడితే హాయ్ అంటే హాయ్ అనే అనుబంధమే కానీ.. రోజూ ఫోన్స్ చేసుకునే పరిచయం కానీ, నెలకొకసారి కలుసుకునే స్నేహం కానీ వారి మధ్యన లేదు. అందులో కాంపిటీషన్ ఉన్న హీరోస్. 

Advertisement
CJ Advs

అందుకే పవన్ ని ఆహా టాక్ షోకి ఎలా తీసుకురావాలి.. బాలయ్య తో పవన్ ని కలిపి కూర్చోబెట్టి షో ఎలా షో చేయించాలా అనే ఆందోళన షో నిర్వాహకులకు, షోకి పని చేసేవారికి చాలానే ఉండి ఉంటుంది. తాజాగా అన్ స్టాపబుల్ కి డైలాగ్స్ అందించే BVS రవి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని తీసుకురావడానికి చాలా కష్టపడినట్లుగా చెప్పడు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి డోర్ కొట్టే సాహసం చెయ్యరు, ఆయనేమి సాధారణ వ్యక్తి కాదు. అందుకే ఆయనని షోకి తీసుకురావడానికి ముందు త్రివిక్రమ్ గారు, నాగవంశీ గారిని ఇలా కలిసి పవన్ కళ్యాణ్ ని ఒప్పించామంటూ చెప్పాడు రవి.

ఇక స్టేజ్ పైకి రాగానే బాలకృష్ణగారు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ గట్టిగా నవ్వేశారని.. ఆయన అస్సలు నవ్వు ఆపుకోలేడంటూ రవి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. 

It was very difficult to convince Pawan Kalyan:

BVS Ravi interview about Aha Unstoppable
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs