Advertisement
Google Ads BL

NTRతో అన్ స్టాపబుల్: NKR కామెంట్స్


అల్లు అరవింద్ గారు అసాధ్యమయ్యే పనులని ఆయన తన తెలివితేటలతో సుసాధ్యం చేసి మరీ బోలెడంత క్యాష్ చేసుకుంటున్నారు. అందులో భాగమే ఆహా అన్ స్టాపబుల్ కి నందమూరి నట సింహాన్ని దించడం. అంతేకాకుండా టాక్ షోలపై ఇంట్రెస్ట్ చూపించని మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ ని గెస్ట్ లుగా తీసుకురావడం. ఇవన్నీ అసాధ్యమే. కానీ అరవింద్ గారి తెలివితేటల ముందు అవి సుసాధ్యమయ్యాయి. అయితే ఇప్పుడు ఆహా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి హీరోలు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు కలిసి రావాలని అనేది అభిమానుల కోరిక, డిమాండ్. కానీ అది అసాధ్యమనే మాట గట్టిగా వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

అదే విషయాన్ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ని అమిగోస్ ప్రమోషన్స్ లో మీరు తారక్ బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ టాక్ షో కి ఎప్పుడు వెళతారు, మీరు ముగ్గురిని ఒకే స్టేజ్ పై చూడాలి అని నందమూరి అభిమానుల కోరిక.. సీజన్ వన్ పూర్తయ్యింది, సీజన్ 2 ముగుస్తుంది, ఇంకా దీనిమీద క్లారిటీ లేదు అనగానే.. అది ఎన్టీఆర్ ఆర్ట్స్ కాదు కదండీ, ఆహా వారిది. మేము అన్ స్టాపబుల్ కి ఎప్పుడు రావాలో అరవింద్ గారు డిసైడ్ చెయ్యాలి, మేము కాదు.. అది నా చేతుల్లో ఏముంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించాడు కళ్యాణ్ రామ్. 

మరి బాలకృష్ణకి తారక్ ని తీసుకురావడం ఇష్టం లేదు, బాలకృష్ణ ఒప్పుకోరు, అందుకే అరవింద్ గారు బాలయ్యని అడిగే సాహసం చెయ్యరు అనే టాక్ కూడా నడుస్తుంది. మరి మూడో సీజన్ కైనా ఎన్టీఆర్ ని ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై చూస్తామేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Unstoppable with NTR: Kalyan Ram Comments:

Nandamuri Kalyanram Comments on Balakrishna Unstoppable Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs