లైగర్ డిసాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కామ్ గా సైలెంట్ గా కనిపిస్తున్నాడు. మధ్యలో లైగర్ పెట్టుబడి విషయంలో ఈడీ విచారణ, లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరింపులు అంటూ పూరి ఇబ్బంది పడ్డాడు. అయితే లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో జన గణ మన చెయ్యాల్సింది. లైగర్ డిసాస్టర్ తో విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత పూరి జగన్నాథ్ చిరుకి కథ చెప్పి ఒప్పించాడనే టాక్ మొదలయ్యింది. గాడ్ ఫాదర్ టైమ్ లో ఇది జరిగింది కూడా. కానీ అఫీషియల్ ప్రకటన రాలేదు. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య హిట్స్ తో పూరి మేటర్ మరుగున పడిపోయింది.
ఇప్పుడు పూరి జగన్నాథ్ కి ఛాన్స్ ఎవరిస్తారో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పూరి జగన్నాథ్ నెక్స్ట్ బాలయ్య తో కానీ, చిరు తో కానీ సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు. బాలయ్య తో పైసా వసూల్ చేసిన పూరి ఆయనకి భారీ డిసాస్టర్ ఇచ్చాడు. అయినా బాలకృష్ణ పూరి కి మరో అవకాశం ఇస్తా అన్నారు కానీ.. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలియదు. ఇక చిరు కూడా అంతే. ఆయన ప్రస్తుతం భోళా శంకర్ చక్కబెట్టే పనిలో ఉన్నారు. అయితే చిరంజీవికి పూరి కి కథకి సంబందించిన ఓ మీటింగ్ రీసెంట్ గా జరిగింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పూరి చెప్పిన కథపై మెగాస్టార్ సానుకూలంగా ఉన్నారనే న్యూస్ కూడా స్ప్రెడ్ అయ్యిపోయింది. మరి నిజంగానే మెగాస్టార్ చిరు పూరి కి ఓకె చెబితే పూరి ని దేవుడు కాపాడినట్టే, లేదు చిరు మరోసారి ఆలోచన చేస్తా అంటే పూరికి మరోసారి కష్టకాలం వచ్చినట్టే.