Advertisement
Google Ads BL

ప్రొఫెషనల్ గా RPకి నాకు పడదు: హైపర్ ఆది


కిర్రాక్ ఆర్పీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని జబర్దస్త్ పై, జబర్దస్త్ యాజమాన్యంపై రకరకాల కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు. మా వల్లే జబర్దస్త్ కి పేరొచ్చింది, మా కష్టమే జబర్దస్త్ కి పేరు రావడానికి కారణం, అంతేకాని జబర్దస్త్ వలన మేము ఎదగలేదు, మా వల్లే జబర్దస్త్ ఎదిగింది. మల్లెమాల యాజమాన్యం అక్కడ ఫుడ్ విషయం పట్టించుకోదు, ఎవ్వరిని ఎదగనివ్వదు, జబర్దస్త్ లో ఫుడ్ తినాలంటే గొంతు దిగదు అంటూ ఆర్పీ జబర్దస్త్ పై రకరకాల కామెంట్స్ చేసాడు. ఆర్పీ కి కౌంటర్ ఎటాక్ కోసం అప్పట్లో టాప్ కమెడియన్స్ హైపర్ ఆది-రామ్ ప్రసాద్ లు అదే యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని కిర్రాక్ ఆర్పీ పై కౌంటర్ లు వేశారు. ఆర్పీ అన్నకి అంత లేదు అంటూ మాట్లాడారు. తర్వాత ఆర్పీ కూడా ఆదిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Advertisement
CJ Advs

అన్నం పెట్టే సంస్థని కించపరచడం కరెక్ట్ కాదు.. అది చెబుదామని ఈ ఇంటర్వ్యూ అని చెప్పారు అది వాళ్ళు. అప్పట్లో ఆది-రామ్ ప్రసాద్ vs కిర్రాక్ ఆర్పీ అన్న రేంజ్ లో విభేదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ లో హైపర్ ఆది మెరవడమే కాదు, ఆర్పీ చేపల పులుసు చాలా బావుంది, ఆర్పీ అన్న అలా, ఆర్పీ అన్న ఇలా అంటూ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి షాకిచ్చాడు. అయితే తర్వాత ఆర్పీ-హైపర్ ఆదిల ప్రెస్ మీట్ లో మట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఇప్పుడు నన్ను చాలామంది ఆర్పీకి మీకు గొడవలయ్యాయి కదా.. మీరెలా ఈ చేపల పులుసు ఓపెనింగ్ వచ్చారు అని అడుగుతున్నారు. అవును నాకు ఆర్పీకి గొడవయ్యింది, ప్రొఫెషనల్ గా ఇప్పటికి నేను ఆర్పీ అన్న గొడవపడతాం, నేను చెప్పింది ఆయనకి నచ్చదు, ఆయన చెప్పింది నేను ఒప్పుకోను, కానీ నేను జబర్దస్త్ కి వచ్చినప్పుడు అభి అన్న నన్నెంతగా ప్రోత్సహించాడో.. ఆర్పీ అన్న కూడా అంతే హెల్ప్ చేసాడు. మా మధ్యన ప్రొఫెషనల్ గా గొడవ ఉంటుంది కానీ.. బయట మేము స్నేహితులమే అంటూ హైపర్ ఆది కిర్రాక్ ఆర్పీకి తనకి మధ్యన శత్రుత్వం ఏమి లేదని తేల్చేసాడు.

RP and Hyper Aadi emotional press meet:

Kiraak RP and Aadi Sensational Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs