Advertisement
Google Ads BL

చార్మినార్ లో రామ్ చరణ్


రామ్ చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే RC15 షూటింగ్ కోసం రెడీ అయ్యారు. మధ్యలో ఇండియన్ 2 షూటింగ్ కోసం శంకర్ సమయం తీసుకుని ఇప్పుడు RC15 షూటింగ్ కి వచ్చారు. ప్రస్తుతం RC25 షూటింగ్ హైదరాబాద్ ఓల్డ్ బస్తీలో మొదలయ్యింది. నిన్న గురువారం శంకర్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో మొదలైనట్టుగా శంకర్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. ఛార్మినార్ దగ్గర దర్శకుడు శంకర్ పిక్ ని షేర్ చేస్తూ.. ఐకానిక్ చార్మినార్ వద్ద RC15 తరవాత షెడ్యూల్‌కు సిద్ధం చేస్తున్నామని ఆయన ట్వీట్‌ చేసారు. దానితో రామ్ చరణ్ ఓల్డ్ సిటీకి రాబోతున్నాడని తెలిసి మెగా ఫాన్స్ అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కియారా అద్వానీ పాల్గొనకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె రీసెంట్ గానే వివాహం చేసుకుని ప్రస్తుతం అత్తారింట్లో కాలు పెట్టింది. నిన్న గురువారం కియారా తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి అత్తారింటికి వెళ్ళిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ లో శంకర్ కియారా-రామ్ చరణ్ పై అదిరిపోయే సాంగ్ ని తెరకెక్కించారు. ఈ సాంగ్ ని శంకర్ భారీగా 15 కోట్ల ఖర్చుతో చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే చార్మినార్ దగ్గర జరిగే షెడ్యూల్ లో రామ్ చరణ్-విలన్ పాత్రధారి సూర్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారా.. లేదంటే రామ్ చరణ్ పై ఇంట్రో సాంగ్ తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ లో చరణ్ సోలో సాంగ్ తెరకెక్కిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ కొద్దిమేర సాంగ్ షూట్ చేసి అదే సాంగ్ కోసం మళ్ళీ రాజమండ్రి పయనమవుతుందట RC15 టీమ్.

RC15 shoot at the ICONIC Charminar area:

Ram Charan RC15 next schedule details out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs