Advertisement
Google Ads BL

తప్పు చేశానంటూ సిరి కన్నీళ్లు-శ్రీహన్ ఓదార్పు


బిగ్ బాస్ సీజన్ 5 లో ఫ్రెండ్స్ గా అడుగుపెట్టి అంతకు మించిన అనేలా బిహేవ్ చేసిన షణ్ముఖ్-సిరిలు పర్సనల్ లైఫ్ లోనే కాదు.. సోషల్ మీడియాలో లాస్ అయ్యి ట్రోల్ అయ్యారు. వీరి ఫ్రెండ్ షిప్ వలనే షణ్ముఖ్ టైటిల్ ట్రోఫీని వదులుకోగా.. సిరిపై దారుణమైన కామెంట్స్ పడినాయి. ఇక బయటికొచ్చాక షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునాయనాని కోల్పోగా.. సిరికి ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో ఆల్మోస్ట్ బ్రేకప్ అయ్యినంత పనయ్యింది. అయితే అప్పటినుండి సిరి మళ్ళీ సీజన్ 6 లో మళ్ళీ ఫెమస్ అయ్యింది. కారణం శ్రీహన్ సీజన్ 6 లో టాప్ 2 లోకి వెళ్ళాడు. సిరి ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి శ్రీహన్ పై ప్రేమ కురిపించింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సిరి-శ్రీహన్ లు స్టార్ మా లో ప్రసారం కాబోయే వాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. కపుల్స్ గా వచ్చిన సిరి-శ్రీహన్ లపైనే అందరి దృష్టి ఉంది. కారణం వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. రీల్ వర్సెస్ రియల్ జంట పేరుతో ప్రసారమయ్యే ప్రోగ్రాంలో శ్రీహన్ కి సిరి చాలా గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. శ్రీహన్ చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహన్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, శ్రీహన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని షర్ట్ పై ముద్దులు పెట్టేదాన్నంటూ ఆ స్టేజ్ పై షర్ట్ ని శ్రీహన్ కి గిఫ్ట్ గా ఇచ్చింది.

తర్వాత సిరి ఎమోషనల్ అవుతూ చిన్న, చిన్న తప్పులు ఎవ్వరైనా చేస్తారని, కానీ స్టేజ్ పై ఎవ్వరూ ఒప్పుకోరని, నేను నిజంగానే, నాకు తెలియకుండా తప్పు చేశాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దానితో శ్రీహన్ సిరిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అయితే సిరి సీజన్ 5 లో షణ్ముఖ్ తో చేసిన ఫ్రెండ్ షిప్ వల్లే తప్పు చేశాను అని స్టేజ్ పై ఒప్పుకుంటుందేమో.. అందుకే ఆమె ప్రోమోలో అలా మాట్లాడింది అంటూ గుసగుసలాడుతున్నారు. 

Siri Cries On Valentine Day Special Show:

Siri Hanmanth Cries On Valentine Day Special Show In Star Maa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs