Advertisement
Google Ads BL

రామ్ చరణ్ లైనప్ పై మెగా ఫాన్స్ హ్యాపీ


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టేటస్ తో పాటుగా రామ్ చరణ్ పై ఒత్తిడి కూడా ఎక్కువైంది. సరైన కథలని ఎంచుకోవాలి, కేవలం పాన్ ఇండియాకి సరిపోయే కథల తోనే సినిమాలు చెయ్యాలి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ శంకర్ తో RC15 శంకర్ దర్శకత్వంలో చేస్తూనే గౌతమ్ తిన్ననూరితో చెయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి బుచ్చిబాబుతో ముందుకు వెళుతున్నాడు. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ తో చేసియాల్సిన బుచ్చిబాబు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించి సినిమా అనౌన్స్ చేసాడు. 

Advertisement
CJ Advs

ఇక తర్వాత రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ నార్తన్ కి టచ్ లో ఉన్నాడనే టాక్ ఎప్పటినుండో ప్రచారం లో ఉంది. కన్నడ దర్శకుడు నార్తన్ తో RC17 పై ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తర్వాత రామ్ చరణ్ విక్రమ్ ఫేమ్ లోకేష్ కానగరాజ్ తో RC18 చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిమధ్యన మీటింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. లోకేష్ కానగరాజ్ విజయ్ తో లియోచిత్రం పూర్తి కాగానే రామ్ చరణ్ RC18 తో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చెయ్యబోయే సినిమాల లిస్ట్ అంటూ మెగా ఫాన్స్ ఈ నాలుగు ప్రాజెక్ట్ లని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. చరణ్ లైనప్ చూసి మెగా ఫాన్స్ కూడా హ్యాపీ గా ఫీలవుతున్నారు.

Mega fans are happy with Ram Charan line-up:

Ram Charan Fans Excited with Super Lineup
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs