Advertisement
Google Ads BL

రశ్మిక మందన్నకి చర్మ వ్యాధి ?


ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా పలు భాషల్లో భారీ ప్రాజెక్ట్ లతో క్రేజీ హీరోయిన్ గా మారిన రశ్మిక మందన్న ఈ ఏడాది విజయ్ తో నటించిన వారిసు తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది రిలీజ్ అయిన పది రోజులకే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను తో ఓటిటి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చేతినిండా సినిమాలు, క్షణం తీరిక లేని షూటింగ్స్ చేస్తున్న రష్మిక మధ్య మధ్యలో గ్లామర్ గర్ల్ లా మారిపోయి సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తుంది. అయితే రష్మిక కి డైరీ రాసే అలవాటుంది. ఆమె ప్రతి రోజు తాను చేసే పనులని, దిన చర్యని డైరీలో ఉంచుతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఆ డైరీ విషయాలను ఇన్స్టా లో షేర్ చేస్తూ తాను ఒక రోజు చేసిన పనులని చెప్పింది. డియర్ డైరీ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచిపోయింది. నిద్ర లేవగానే కార్డియో వర్కౌట్ చేశాను. ఆ తర్వాత ఆహారం తీసుకున్నాను, రేపటి షెడ్యూల్ కోసం బ్యాగ్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ ఎప్పటిలాగే నా చుట్టూ ఉన్న క్లైమేట్, ఇంకా స్నో నన్ను ఇక్కడికి కదలకుండా డ్రామా చేసాయి. ఇక బ్యాగ్ సర్దేసాక మళ్ళీ వర్కౌట్ చేశాను.

ఆ తర్వాత డిన్నర్ చేసేసి డెర్మటాలజి(చర్మ సంబంధిత డాక్టర్) అప్పాయింట్మెంట్ తీసుకున్నానంటూ రష్మిక ఇన్స్టా లో షేర్ చెయ్యడంతో.. రష్మిక మందన్న ఏదో స్కిన్ డిసీస్ తో బాధపడుతుంది అంటూ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే రకరకాల మేకప్స్ వేసుకునే హీరోయిన్స్ చాలామంది ఇలాంటి చర్మవ్యాధులకు గురవుతూ ఉంటారు. ఇంతకుముందు నయనతార, సమంత లాంటి వాళ్ళు ఇలాంటి స్కిన్ డిసీస్ రో ఇబ్బందిపడినవారే. ఇప్పుడా లిస్ట్ లోకి రష్మిక చేరినట్టుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Suffering from Skin Disease?:

Rashmika Mandanna to associate a dermatologist appointment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs