Advertisement
Google Ads BL

పవన్ కోసం ఢీ వదులుకున్న హైపర్ ఆది


జబర్దస్త్ లో అదిరిపోయే స్కిట్స్ చేస్తూ మెగా ఫ్యామిలీకి దగ్గరై.. అటు ఈటీవిలోనే ఢీ డాన్స్ షో కి డైలాగ్స్ అందించే స్థాయి నుండి ఆ షోకి మెంటర్ గా వ్యవహరిస్తూ కామెడీ పంచ్ లు వేస్తూ జెడ్జ్ లని, డాన్స్ మాస్టర్ లని, ఆఖరికి యాంకర్ ప్రదీప్ ని ఓ ఆటాడుకునే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కోసం ఢీ షో వదులుకున్నాడట. ఈ మధ్యన హైపర్ ఆది పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి అఫీషియల్ గా వెళ్లకపోయినా.. జనసేన పార్టీ సభలకి హాజరవుతూ వైసిపి ప్రభుత్వం, వైసిపి మినిస్టర్స్ మీద జబర్దస్త్ పంచ్ లతో చెలరేగిపోయాడు.

Advertisement
CJ Advs

అయితే తననొక నిర్మాత నీకు ఢీ ఆన్స్ షో కావాలా.. పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగాడని.. నాకు పవన్ ముఖ్యమని చెప్పినట్లుగా రీసెంట్ గా జరిగిన సార్ మూవీ ట్రైలర్ లాంచ్ లో హైపర్ ఆది బయటపెట్టాడు. ధనుష్ నటించిన సార్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆది మట్లాడుతూ.. నాగవంశీ పైకి ప్రొడ్యూసర్‌లాగా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ, ఆయనలో కూడా ఓ హీరో ఉన్నారు. ఆయనకి లోపల విజయ్ దేవరకొండ అర్జున్‌ రెడ్డి అంత యాటిట్యూడ్‌ ఉంటుంది. ఆయన చాలా జెన్యూన్. కానీ ఒక్కోసారి ఆయన మాటలను తప్పుగా అర్ధం చేసుకుని తప్పుగా రాస్తున్నారు. నాగ వంశీ చాలా స్ట్రైట్‌ పార్వర్డ్‌.

ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లానాయక్‌ సాంగ్‌ నాలుగు రోజులు షూట్‌ చేశా. ఓ రోజు ఆయనకు ఫోన్‌ చేశా. సార్‌ ఒక ఆఫ్‌ డే కావాలి సార్‌.. ఢీ షూటింగ్‌కు రమ్మంటున్నారు అని. అలా అడిగితే ఎవరైనా ఎలా కుదురురుతుంది మీరు రావాల్సిందే అంటారు. కానీ నాగవంశీగారు ఢీ కావాలో.. పవన్‌ కావాలో తేల్చుకో అన్నారు. నేనేమి మాట్లాడకుండా రెండు చేతులు జేబులో పెట్టుకుని భీమ్లానాయక్‌ షూటింగ్‌కు వెళ్లిపోయా.. అంటూ నాగ వంశీ తనని ఢీ కావాలో.. పవన్ కావాలో తేల్చుకోమన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

Hyper Aadi shocking comments on Naga Vamsi :

Hyper Aadi interesting comments on producer Naga Vamsi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs