నిన్న మంగళవారం రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘడ్ కోటలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ-హీరో సిద్దార్థ్ ల వివాహం అంగరంగ వైభవముగా జరిగింది. ఈ పెళ్లికి అతికొద్దిమంది సెలబ్రిటీస్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే కియారా అద్వానీ పెళ్లి వార్తలు ఎంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో.. వాళ్ళ పెళ్లి ఫొటోస్ కోసం ప్రేక్షకులు, నెటిజెన్స్ అంటే ఆతృతగా ఎదురు చూసారు. అయితే మూడేళ్ళ ప్రేమని సీక్రెట్ గా మెయింటింగ్ చేసి.. మూడేళ్ళ తర్వాత కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోయే వార్త చెప్పకుండానే పెళ్లి పీటలెక్కిన కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు.. పెళ్లి తర్వాత అఫీషియల్ గా తమ బంధాన్ని పిక్స్ రూపంలో రివీల్ చేసారు.
మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి కియారా-సిద్ ల పెళ్లి ఫొటోస్ షేర్ చేసారు. ఇక కియారా అద్వానీ-సిద్దార్థ్ లు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల నుండి షేర్ చేస్తూ ఇప్పుడు మేము శాశ్వతంగా బుక్ అయిపోయాము అంటూ క్యాప్షన్ పెట్టారు. ముందున్న ఈ ప్రయాణంలో మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని ట్వీట్ చేసారు. పెళ్లి ఫొటోల్లో కియారా అద్వానీ-సిద్దార్థ్ లు చాలా అందంగా, క్యూట్ గా కనిపించారు. కియారా లేత గులాబీరంగు లెహంగాలో, సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షేర్వానీలో కనిపించారు.
కియారాను సిద్దార్థ్ మల్హోత్రా ముద్దాడుతున్న ఫోటో తో పాటుగా కియారా సిద్దార్థ్ కి ముద్దు పెడుతున్న పిక్స్, అలాగే ఒకరినొకరు అపురూపంగా చూసుకుంటున్న మూడు పిక్స్ ని షేర్ చెయ్యగానే అవి సెకన్స్ లో వైరల్ గా మారాయి.