కొద్దిరోజులుగా సెలబ్రిటీస్ తమ పెళ్లి హక్కులని కూడా ఓటిటీలకి అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాలకి వెళుతుంటే.. ఇంకొంతమంది రాజస్థాన్ కోటలోనో, లేదంటే గోవా లోనో చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారంటే ప్రేక్షకులకి, నెటిజెన్స్ కి ఎక్కడ లేని క్యూరియాసిటీ. పెళ్లి కూతురు ఎలాంటి నగలు వేసింది, ఎంత కాస్ట్లీ దుస్తులు ధరించింది, పెళ్లి ఎలా జరిగింది, అసలు ఈ పెళ్లికి ఏ సెలబ్రిటీస్ హాజరయ్యారో అనే క్యూరియాసిటీ.. దానికోసం గూగుల్ ని, సోషల్ మీడియాని వెతికేస్తూ ఉంటారు.
ఇక పెళ్లిళ్లు ఓటిటీలకి అమ్ముకున్నా.. తమ పెళ్లి ఫస్ట్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఫాన్స్ కి ఆనందాన్ని పంచేస్తారు. అలానే ఈ మధ్యన నయనతార, హన్సిక, రీసెంట్ గా అతియా శెట్టిలు తమ పెళ్లి హక్కులని ఓటిటీలకి ఆమ్మేసుకున్న పెళ్లి తర్వాత వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల నుండి పిక్స్ వదిలారు. ఇప్పుడు కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి రాజస్థాన్ లోని జైసల్మార్ లోని సూర్యఘడ్ కోటలో అంగరంగ వైభవంగా ఈ రోజు మంగళవారం జరిగిపోయింది.
ఈ పెళ్ళికి ఎవరెవరు హాజరయ్యారో అనేది అధికారికంగా బయటికి రాకపోయినా..కరణ్ జోహార్, అంబానీ ఫ్యామిలిలో కొందరు, షాహిద్, మీరా రాజ్ ఫుట్, రామ్ చరణ్, ఇంకా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ పెళ్ళికి హాజరయ్యారనే లిస్ట్ సోషల్ మీడియాలో కనిపించింది. అక్కడ జరిగిన విందు, అలాగే కానుకల వివరాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈరోజు ఉదయం నుండి కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తారేమో అని అందరూ కాచుకుని కూర్చున్నారు.
కానీ కియార్ అద్వానీ పెళ్లి సెలెబ్రేషన్స్ పిక్ కానీ, సిద్ మూడు వేసిన పిక్ కానీ బయటికి రాలేదు. కియారా పెళ్లి కూతురు గెటప్ కానీ, అక్కడ జరిగిన మెహిందీ, సంగీత్ ఫంక్షన్స్ ఫొటోస్ ఏ ఒక్కటి లీక్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు ఓకె. కనీసం పెళ్లి ఫోటో అయినా వదిలితే నెటిజెన్స్ అందంపడేవారు. కానీ ఇలా ఎలా చేస్తారు, ఎలా సాధ్యమంటూ అందరూ షాకవుతున్నారు.