ఒకప్పుడు రకుల్ ప్రీత్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన పేరు. కానీ ఇప్పుడు దాదాపుగా తెలుగు ప్రేక్షకులు రకుల్ పేరు మర్చిపోయేలా ఉన్నారు. ఎందుకంటే గత రెండుమూడేళ్లుగా రకుల్ ప్రీత్ పేరు అసలు తెలుగులో వినిపించడమే లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా రకుల్ ప్రీత్ మాత్రం లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. గ్లామర్ ఫోటో షూట్, అందాలు ఆరబొయ్యడం అనేది రకుల్ టార్గెట్ గా పెట్టుకుంది.
బాలీవుడ్ లో కాస్త బిజీగా కనబడుతున్న రకుల్ ప్రీత్ అటు బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తోనూ న్యూ ఇయర్ కి, సంక్రాంతికి వెకేషన్స్ అంటూ విదేశాలకి బిజీ బిజీగా తిరుగుతుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో గ్లామర్ షూట్ ని నమ్ముకుంది. అందుకే పదే పదే ఆమె సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ వదిలినట్టుగానే ఈరోజు మంగళవారం ఓ లుక్ వదిలింది. నిజంగా ఆ ఫొటోస్ లో రకుల్ ఏంజిల్ లా కనిపిస్తుంది. క్రీమ్ కలర్ లెహంగాలో రకుల్ ప్రీత్ మెరిసిపోతూ కనిపించినా.. ఆమె అందాలు ఓవర్ గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఆకర్షణగా కనిపించింది.
సిల్వర్ కలర్ డ్రెస్ లో, లూజ్ హెయిర్ తో, సిల్వర్ కలర్ జ్యువలరీతో రకుల్ ఫోటో షూట్ మెస్మరైజింగ్ గాను, బ్యూటిఫుల్ గాను ఉంది. మీరు రకుల్ కొత్తందాలని ఓ లుక్కెయ్యండి.