పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా విరామం లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రాజెక్టు K, సలార్, మధ్యలో మారుతి తో చేస్తున్న రాజా డీలక్స్ షూటింగ్ లో బ్రేక్ లేకుండా పాల్గొంటున్న ప్రభాస్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా మారుతి సినిమాను ఫినిష్ చేయాలని ప్రభాస్ ఇలా తీరిక లేకుండా షూటింగ్స్ హాజరవడంతో అలిసిపోయి జ్వరం బారిన పడినట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ మారుతి సినిమా కోసం కేవలం 40 రోజుల కాల్షిట్స్ ఇచ్చినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది.
జ్వరం బారిన పడడంతో ప్రభాస్ రెస్టు తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్పడంతో.. ఆయన షూటింగ్లకు కొంత విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దానితో మారుతి తో త్వరలో స్టార్ట్ చేయాలని అనుకున్న షెడ్యూల్ కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. మరోపక్క సలార్ ఫైనల్ షెడ్యూల్ కూడా ప్రభాస్ అనారోగ్యం కారణంగా ఆలస్యం కానున్నట్లుగా సమాచారం.
ప్రభాస్ కేవలం జ్వరంతోనే బాధపడుతున్నారని, ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ తర్వాత మాములుగా షూటింగ్స్ కి హాజవ్వొచ్చని డాక్టర్స్ చెప్పారని, అభిమానులెవరూ కంగారు పడవలసిన అవసరం లేదని, ప్రభాస్ త్వరలోనే కోలుకుంటారని ఆయన సన్నహిత వర్గాలు సమాచారమిస్తున్నాయి.