Advertisement
Google Ads BL

కియారకి కోట్లలో గిఫ్ట్స్ ఇవ్వనున్న సిద్దార్థ్


బాలీవుడ్ నటి కియారా అద్వానీ-హీరో సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ రోజు రాజస్థాన్ లోని జైసల్మేర్‌ కోటాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. నిన్న సోమవారం, జరగాల్సిన కియారా-సిద్దార్థ్ ల వివాహం కొన్ని కారణాల వలన ఈరోజు మంగళవారం జరగబోతుంది. ఈ పెళ్ళికి కొద్దిమంది అతిధులు హాజరవవుతారని అన్నప్పటికీ.. బాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీస్ కియారా-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహం కోసం రాజస్థాన్ కి వెళ్లారు. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ సాటి సమేతంగా రాజస్థాన్ కి వెళ్ళి కియారా పెళ్ళిలో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. కియారా, సిద్దార్థ్ వెంట కరణ్ జోహర్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జుహీ చావ్లా, అంబానీ కుటుంబాలు రాజస్థాన్ కి వెళ్లిపోయాయి.

Advertisement
CJ Advs

పెళ్ళికి వచ్చిన అతిధులకు జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కళ్ళు చెదిరేలా విందు ఏర్పాట్లు చేశారని, దాదాపు 100కుపైగా నోరూరుంచే వంటకాలను అతిధుల కోసం సిద్దం చేస్తున్నారట. ఇటాలియన్, చైనీస్, అమెరికన్, సౌత్ ఇండియన్, మెక్సికన్, రాజస్థానీ, పంజాబీ, గుజరాతీ డిషెస్‌ను సిద్దం చేశారు. ఇక పెళ్లి తర్వాత సిద్ధర్థ్ మల్హోత్రా తన భార్య కియారకి ఖరీదైన కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వబోతున్నట్లుగా సిద్దార్థ్ ఫ్యామిలీ మెంబెర్స్ చెబుతున్నారు.

కియార పెళ్లి తర్వాత విలాసవంతమైన కారును, ఖరీదైన నెక్లెస్‌ను ఆమెకి గిఫ్టుగా ఇస్తారని, కియారాకు సిద్దార్థ్ ఇచ్చే గిఫ్టు విలువ కనీసం 5 కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తుంది. అలాగే కియారా-సిద్దార్థ్ ల జోడి పెళ్లి తర్వాత రాజస్థాన్ నుండి నేరుగా ముంబైలోని విలాసవంతమైన ఇంటిలోకి వెళ్లనున్నారు. పెళ్ళికి ముందే కియారా-సిద్దార్థ్ లు తమకి నచ్చినట్టుగా ఆ ఇంటిని తయారు చేసుకున్నారట. పెళ్లి తర్వాత కియారా-సిద్దార్థ్ లు అదే ఇంట్లో ఉండనున్నారట.

Will Kiara and Siddharth live in a new house after marriage:

Check Out Sidharth Malhotra & Kiara Advani Wedding Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs