Advertisement
Google Ads BL

నా చేపల పులుసుపై పగ పట్టారు: ఆర్పీ


జబర్దస్త్ నుండి అదిరింది అంటూ కామెడీ షోస్ చేసే కిర్రాక్ ఆర్పీ స్టార్ మా లోని కామెడీ స్టార్స్ తో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు కమెడియన్ గా వచ్చిన ఫేమ్ కన్నా ఎక్కువగా జబర్దస్త్ పై ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు.. ఆర్పీని తెగ పాపులర్ చేసాయి. తర్వాత సినిమా డైరెక్ట్ చేస్తానంటూ హడావిడి చేసి మూవీ ఓపెనింగ్ కూడా చేసిన ఆర్పీ అది పక్కనపడేసి.. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్ పెట్టాడు. దానిని కూడా రెండు రోజుల్లో జనాల్లోకి తీసుకెళ్లేలా యూట్యూబ్ ఛానల్స్ తో టైయ్యప్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక యూట్యూబ్ ఛానల్స్ ఆర్పీ చేపల పులుసు వండే చోటుకి కూడా వెళ్లి ఆ వీడియోస్, చేపలు కడిగి కోసే వీడియోస్, అలాగే షాప్ దగ్గర ఉన్న క్రౌడ్ వీడియోస్ తో చేపల పులుసుకి భీబత్సమైన పబ్లిసిటీ తెచ్చేసాడు. ఇక హైదరాబాద్ వాసులు ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కసారైనా టేస్ట్ చూడాలనే స్టేజ్ కి వచ్చేలా చేసాడు. మధ్యలో క్రౌడ్ తట్టుకోకలేక ఓ వారం షాప్ మూసేసి మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాడు. రీ ఓపెన్ తర్వాత మాదాపూర్, ఎస్ ఆర్ నగర్స్ లో బ్రాంచ్ లు ఓపెన్ చేసి.. ఇక్కడ కూడా క్లిక్ అయ్యాక ఫ్రాంచైస్ ఇస్తా అంటూ గొప్పలు పోయాడు. 

అయితే ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాగోలేదంటూ కొంతమంది కావాలనే రివ్యూస్ ఇస్తూ నాపై పగబట్టి, నా షాప్ మూయించేసేలా చూస్తున్నారంటూ ఆర్పీ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. నా చేపల పులుసు టేస్ట్ చూసి కొత్త కష్టమర్స్ ని తీసుకుని ఓల్డ్ కస్టమర్స్ వస్తున్నారు, నా చేపల పులుసు బాగాలేదని ఒక్కడు నెగెటివ్ గా చెప్పినా నాకేం పోదు, దానిని బట్టి ఆ వ్యక్తి ఎంత కుళ్లుబుద్ది ఉన్నాడో అర్ధమవుతుంది అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Resentful of my fish Curry: RP:

Public Review On Nellore Pedda Reddy Chepala Pulusu Curry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs