Advertisement
Google Ads BL

ప్రభాస్-కృతి సనన్ పై ఇంత అతి అవసరమా?


ప్రభాస్ కి బాలీవుడ్ భామ ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కి మధ్యలో ఏదో నడిచేస్తుంది అంటూ మీడియా చేసిన హంగామాకి అటు కృతి సనన్, ఇటు ప్రభాస్ తమ తమ స్టయిల్స్ లో స్పందించారు. ఆదిపురుష్ లో కలిసి నటించిన ఈ జంటపై అబ్బో రకరకాల రూమర్స్ క్రియేట్ చేసేసి.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ గాసిప్స్ అల్లేశారు. కానీ మా మధ్యన ఏం లేదు.. జస్ట్ నాకు ప్రభాస్ కో స్టార్ మాత్రమే అని కృతి సనన్ అంటే.. ప్రభాస్ మాత్రం మేడమ్ క్లారిటీ ఇచ్చారుగా ఏమి లేదంటూ అని తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ ని స్మూత్ గా ఖండించాడు.

Advertisement
CJ Advs

అప్పటినుండి సైలెంట్ గా ఉన్న సోషల్ మీడియా మరోసారి ప్రభాస్-కృతి సనన్ పై గాసిప్ కి తెరలేపింది. అదేదో డేటింగ్ పై వచ్చే కథనాలు కాదు.. ఏకంగా ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు, అది కూడా వచ్చే వారమే అన్నట్టుగా.. వీరికేదో ప్రభాస్-కృతి సనన్ స్పెషల్ గా ఫోన్ చేసి తమ నిశ్చితార్ధం గురించి చెప్పినట్టుగా రాసేస్తున్నారు. ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ క్రిటిక్ ఉమైర్ సందు కూడా ట్వీట్ చేసాడు. అసలు ఉమైర్ సందు చెప్పేవి ఎవరూ నమ్మరు. కానీ ఉమైర్ మాటలను పట్టుకుని ప్రముఖ మీడియా ఛానల్స్ కూడా ప్రభాస్-కృతి సనన్ వచ్చే వారం నిశ్చితార్ధం చేసుకోబోతున్నారంటూ హైలెట్ చెయ్యడం ఎంతవరకు న్యాయం.

మా మధ్యన ఏం లేదు బాబోయ్ అని మొత్తుకున్నా.. ఇలాంటి వార్తలు ఎందుకు పుడతాయి, ఎవరు పుట్టిస్తారో కానీ.. ఈ నాన్ సెన్స్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడం పట్ల ప్రభాస్ ఫాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం హ్యాపీనే.. కానీ లేని ఉన్నట్లుగా క్రియేట్ చెయ్యడమే వారికి నచ్చడం లేదు.

Is Prabhas-Kriti Sanon so necessary?:

Prabhas-Kriti Sanon engagement rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs