Advertisement
Google Ads BL

కాంతార 2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన రిషబ్


కన్నడ కాంతార కన్నడలోనే కాదు.. పాన్ ఇండియాలోని పలు భాషల్లో సూపర్ సక్సెస్ అయిన చిత్రం. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం మాములు విషయం కాదు. హీరో రిషబ్ శెట్టి కాంతార సక్సెస్ ని నిన్నమొన్నటివరకు పలు భాషల్లో ప్రమోట్ చేస్తూ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంతార కి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించాక.. అది ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో ఉంటుంది, ఈసారి రిషబ్ శెట్టి చూపించబోయే కాన్సప్ట్ ఏమిటి అనే క్యూరియాసిటిలో కాంతార ఫాన్స్ మునిగితేలుతున్నారు. అయితే కాంతార 2 ప్రకటించి చాలారోజులు గడుస్తున్నా దాని అప్ డేట్ రాకపోయేసరికి ఫాన్స్ లో ఆత్రుత మరింతగా ఎక్కువైంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా రిషబ్ శెట్టి కాంతార 2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ కాంతార 2 ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తాము, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి, అతి త్వరలోనే కాంతార 2 రెగ్యులర్ షూట్ ని మొదలు పెడతాము, కాంతార సీక్వెల్ కాదు, ప్రీక్వెల్, కాంతార స్టోరీ ఎక్కడైతే మొదలయ్యిందో.. అంతకు ముందు జరిగిన సంఘటనల కథతో కాంతార 2 ఉండబోతుంది.

అంతేకాకుండా పంజర్లకి సంబందించిన సన్నివేశాలు పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటాయి అంటూ రిషబ్ శెట్టి కాంతార 2 పై సూపర్ సూపర్ అప్ డేట్ ఇచ్చేసరికి.. కాంతార ఫాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.

 

Rishab Shetty crazy update on Kantara 2:

Kantara 2: Rishab Shetty-starrer Kantara to get prequel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs