ట్రెడిషన్ గర్ల్, పద్దతికి మారుపేరు అనుపమ పరమేశ్వరన్ కూడా లుక్ మార్చేసింది. మరి ట్రెడిషనల్ గా ఉంటే ఆఫర్ రావు అనేది నగ్న సత్యం. అనుపమ టాలెంటెడ్ యాక్ట్రెస్. కానీ ఆమెకి అనుకున్న స్టార్ అవకాశాలు మాత్రం రావడం లేదు. అనుపమ కి రంగస్థలం అవకాశం చేజారడం నిజంగా ఆమె దురదృష్టం. స్టార్ హీరోల అవకాశాల కోసం ఇప్పుడు అనుపమ లుక్ మార్చింది. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ తో డీసెంట్ హిట్స్ అందుకుంది.
ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లో కనిపించబోతున్న అనుపమ.. గ్లామర్ గాను టర్న్ అయ్యింది. అందాలు బాగా ఆరబొయ్యకుండా.. జస్ట్ కొద్దిగా చూపిస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కర్లీ హెయిర్ తో కత్తిలా తయారైంది. రీసెంట్ గా అనుపమ గ్లామర్ షూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెయిర్ టైట్ గా బిగించి పోనీ పెట్టి క్రీమ్ కలర్ ఫ్రాక్ లో బుట్టబొమ్మలా తయారైంది. ఈ గ్లామర్ డ్రెస్ లో రకరాల భంగిమలతో అనుపమ అందాలు చూపించేసింది. ట్రెడిషన్ గర్ల్.. లుక్ మార్చేసి ఇలా గ్లామర్ గా కనిపిస్తుంది. మరి ఈ లుక్ ఏమైనా అనుపమ సహాయం చేసి అవకాశాలు ఇప్పిస్తుందేమో చూడాలి.