ప్రముఖ గాయని వాణి జయరామ్ శనివారం ఉదయం చెన్నై లోని తన నివాసంలో కన్ను మూసారు. వాణి జయరామ్ తన ఇంట్లో ఎప్పటినుండో ఒక్కరే ఉంటున్నారు. అయితే వాణి జయరామ్ మృతిపై సినిమా ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురించేయ్యగా.. ఆమె మృతి పోలీస్ లకి షాకిచ్చింది. వాణి జయరామ్ డెత్ నేచురల్ డెత్ కాదని, ఆమె మరణాన్ని అనుమానాస్పదమృతిగా నమోదు చేసారు పోలీస్ లు. వాణి జయరామ్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని ఆమె పనిమనిషి చూసి పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడంతో పోలీస్ లు రంగంలోకి దిగి ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.
వాణి జయరామ్ నుదిటిమీద దెబ్బ కూడా కనిపించడంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే వాణీజయరామ్ మృతిపై అనుమానంతో ఆమె భౌతిక కాయానికి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్స్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. వాణి జయరామ్ తన గదిలోని 2 ఫీట్ల టేబుల్‌పై పడిపోయారు. దాని కారణంగానే ఆమె తలకు బలమైన గాయమైంది. దానితో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె తలకు గాయం కావడంతో టేబుల్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆమెకి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ లభించకపోవడంతోనే మృతి చెందారు
వాణి జయరామ్ మరణం కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. వాణి జయరామ్ పనిమనిషి పోలీస్ లకి కంప్లైంట్ ఇచ్చాక.. పోలీస్ లు ఆవిడ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు రాలేదనే విషయం స్పష్టమైంది అని పోలీస్ లు వెల్లడించారు. వాణి జయరామ్ ఇంటికి వెళ్లి తమిళనాడు సీఎం స్టాలిన్ ఆమెకి నివాళులు అర్పించారు.