Advertisement
Google Ads BL

ప్రభాస్ తో హృతిక్ రోషన్ కన్ ఫర్మ్


వార్, పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్, హృతిక్‌లను కలిపి ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇటీవలే భారీ ప్రాజెక్ట్‌లు వాల్తేర్ వీరయ్య మరియు వీరసింహా రెడ్డిలను ఒకేసారి విడుదల చేయడంలో సంక్లిష్టమైన పరిస్థితులను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతోంది. రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్‌కి చెందిన నవీన్ యెర్నేని డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్‌ను కలుసుకుని పఠాన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ తో సిద్దార్ట్ తో కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు మైత్రివారు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ భాగం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఈ న్యూస్ ని నిజం చేస్తూ సిద్ధార్థ్ ఆనంద్ ను మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా కలవడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి మైత్రి మూవీ అధినేత నవీన్ ప్రత్యేకంగా హృతిక్ రోషన్ ను కలిశారు. ఈ పిక్ చూసాక హృతిక్‌ని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చి అతని డేట్స్ లాక్ చేయడానికి వీరు హృతిక్ రోషన్ తో మీటయ్యారనిపిస్తుంది. అయితే ఈ పిక్ లో హారిష్ శంకర్ కూడా ఉండడానికి కారణం హరీష్ ప్రస్తుతం మైత్రి మూవీస్ లోనే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.

అయితే ప్రభాస్ తో హ్రితిక్ రోషన్ కలయికని ఆల్మోస్ట్ ఫిక్స్ చెయ్యబట్టే మైత్రి వారు ఈ పిక్ ని లీక్ చేసి ఉంటారనే అనుమానాలు ప్రభాస్ ఫాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్-హ్రితిక్ కాంబో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పట్టాలెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Mythri Movie Makers Massive Project With Hrithik Roshan:

Mythri Movie Makers and Harish Shankar meets Hrithik Roshan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs