Advertisement
Google Ads BL

రెజీనాతో లవ్: సందీప్ కిషన్ ఆన్సర్


నటుడు సందీప్ కిషన్ నటించిన మైఖేల్ నిన్న శుక్రవారం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్స్ తో, క్రేజీ నటులతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మైఖేల్ మూవీ ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమైంది. అయితే మైకేల్ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ కి రెజినా తో లవ్ విషయంపై ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజులుగా రెజినా-సందీప్ కిషన్ డేటింగ్ లో ఉన్నారు. అందుకే రెజినా పుట్టిన రోజునాడు హ్యాపీ బర్త్ డే పాప, ఐ లవ్ యు, నీకు ఎప్పుడూ మంచే జరగాలి అంటూ ట్వీట్ చెయ్యడంతో.. అదిగో రేజీనాకి సందీప్ కిషన్ ఐ లవ్ యు చెప్పేసాడు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

Advertisement
CJ Advs

అయితే ఈ విషయమై సందీప్ కిషన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. తాను రెజీనా కలిసి నాలుగు సినిమాలు చేసాము, తాను నా బెస్ట్ ఫ్రెండ్, ఓ ఫ్యామిలీ మెంబెర్ లా కలిసిపోతుంది. తాను పని మీద ముంబై వచ్చినప్పుడు నా సిస్టర్ రూమ్ లోనే ఉంటుంది. మాది 12 ఏళ్ళ స్నేహం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కానీ రెజీనా-సందీప్ కిషన్ ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండదు, వీరి మధ్యన ఏదో ఉంది, ఏదో నడుస్తుంది అంటే సర్ ప్రైజ్ అవుతారు, అందుకే చెన్నై మీడియా  మా గురించి తెలియక అలా రాసేశారు అంటూ రెజీనాతో తన బంధాన్ని సందీప్ కిషన్ బయటపెట్టాడు.

Love with Regina: Sundeep Kishan Answer:

Sundeep Kishan Gives Clarity On his Relationship With Regina
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs