అక్కినేని ఇంటి కోడలిగా, నాగ చైతన్యకి భార్యగా అక్కినేని ఫ్యామిలీలో ఓ మెంబెర్ లా కలిసిపోయిన సమంత అంటే నాగార్జున దగ్గరనుండి అమల, అఖిల్ ఇంకా సుమంత్, సుశాంత్ ఆఖరుకి వెంకటేష్ కూతుర్లకు, రానాకి వీళ్ళందరికీ చాలా ఇష్టం. కానీ చైతు తో విభేదాల వలన తెగతెంపులు చేసుకున్న సమంతని అక్కినేని ఫ్యామిలీ పల్లెత్తిమాట అనలేదు. నాగ చైతన్య-సమంత తీర్చలేని విభేదాలతో సమతమామవడం ఎందుకులే అని విడాకులు తీసుకున్నారు. తర్వాత సమంత, చైతు ఎవరి కెరీర్ ని వారు చూసుకుంటున్నారు. మధ్యలో సమంత అనారోగ్యం పాలైనప్పుడు చైతు ఓ ట్వీట్ వేస్తాడేమో, అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అవుతుందేమో, చైతు ఆమెని ఆసుపత్రిలో పలకరించి వస్తాడేమో, సమంతకి అండగా నిలబడతాడు అనుకున్నవారికి నిరాశే మిగిలింది.
అయితే సమంత చైతూకి మాత్రం విడాకులిచ్చి అతనికి దూరమైంది కానీ అక్కినేని ఫ్యామిలీ కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. తాజాగా అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ డేట్ తో పాటుగా ఓ పవర్ ఫుల్ టీజర్ ని వదిలారు మేకర్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ టీజర్ ని వదలగా.. దానికి సమంత లైక్ కొట్టడమే కాదు, అఖిల్ మేకోవర్ ని చూసి సమంత బీస్ట్ మోడ్ అంటూ కామెంట్ చెయ్యడం అందరిని ఆకర్షించింది.
అది చూసిన ఆమె అభిమానులు, నెటిజెన్స్ కూడా సమంత వదిలేసింది చైతూని మాత్రమే.. అక్కినేని ఫ్యామిలీని కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.