Advertisement
Google Ads BL

వాణి జయరాం మృతిపై షాకింగ్ ట్విస్ట్


ప్రముఖ గాయని వాణి జయరాం ఈరోజు శనివారం చెన్నైలోని తన నివాసంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఎటువంటి అనారోగ్యం లేకుండానే వాణి జయరామ్ హఠాత్తుగా కన్నుమూయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు ఆమె మరణంపై ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. వాణి జయరాంది సహజమరణం కాదని, ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ లు కేసు నమోదు చెయ్యడం మరింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటినుండో వాణి జయరామ్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు, వాణి జయరాం పని మనిషి ఎప్పటిలాగే ఈరోజు వచ్చి ఎన్నిసార్లు తలుపుకొట్టి, కాలింగ్ బెల్ నొక్కినా ఆమె తలుపు తియ్యకపోవడంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

వాణి జయరామ్ నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయని, అప్పటికి ఆవిడ స్పృహలో లేరని అందుకే వెంటనే పోలీస్ లకి సమాచారం ఇవ్వగా.. పోలీస్ లు రంగంలోకి దిగి, గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకుని, సీసీటీవీ ఫుటేజీలు తనిఖీ చేసి తర్వాత వాణీ జయరాం పార్థివ దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. వాణి జయరాం పార్థీవ దేహానికి పోస్ట్ మార్టం పూర్తయినట్లుగా తెలుస్తుంది. వివరాలు తెలియాల్సి ఉంది.

Shocking twist on Vani Jayaram death:

Case registered in singer Vani Jairam death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs