Advertisement
Google Ads BL

షాకింగ్: వాణీ జయరాం కన్నుమూత


సినిమా పరిశ్రమలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో రోజుల క్రితం దర్శకుడు సాగర్ చెన్నై లో కన్నుమూయగా.. తర్వాత రోజే ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధ విసదవకముందే ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఈరోజు చెన్నై లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. వాణి జయరామ్ చెన్నైలోని తన నివాసంలో మరణించినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తెలియజేసారు.

Advertisement
CJ Advs

వాణి జయరామ్ తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి.. తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. తెలుగుతోపాటు దాదాపు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. కె.వి.మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాధన్‌, ఇళయరాజా, పెండ్యాల, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. మూడు జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. 

అయితే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించింది. కానీ అనూహ్యంగా అవార్డును అందుకోకముందే ఆమె మరణించారు. వాణి జయరాం మృతికి సినీరంగ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Tragedy strikes as Vani Jayaram passes away:

Singer Vani Jayaram passed away 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs