Advertisement
Google Ads BL

ఆర్పీ హడావిడి కనిపించడం లేదు


కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసి అదిరింది, కామెడీ స్టార్స్ చేసేసి తర్వాత జబర్దస్త్ పై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ తో విపరీతంగా పాపుల అయ్యి ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ స్టార్ట్ చేసి మరోసారి ఫెమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ మొత్తం కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు వెంట పడడంతో ఒక్కరోజులోనే అతని కర్రీ పాయింట్ పాపులర్ అయ్యింది. కానీ ఒక నెల తిరక్కుండానే ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని మూసేసాడు.

Advertisement
CJ Advs

తన షాప్ దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, అనుకున్నట్లుగా చేపల పులుసు అందించలేకపోతున్నామని, దానికోసం అంటే చేపల పులుసు చెంసేందుకు నెల్లూరు నుండి ఆడవాళ్ళని దించిన ఆర్పీ తరవాత కూడా బాగా హడావిడి చేసాడు. జనవరి 6 న మళ్ళీ రీ ఓపెన్ చేసి హంగామా చేసాడు. అయితే కొద్ది రోజులుగా ఆర్పీ చేపల పులుసు వార్తల్లో లేదు. కారణం సంక్రాంతి తర్వాత ఫుడ్ బిజినెస్ డల్ గా ఉంటుంది. అలాగే కార్తీక మాసంలోను నాన్ వెజ్ కర్రీస్ పెద్దగా కొనరంటున్నాడు ఆర్పీ. అప్పట్లో కస్టమర్లతో ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పుడు స్విగ్గి, జొమాటో బైక్స్ తో ట్రాఫిక్ జామ్ అంటూ ఆర్పీ చేపల పులుసు ఎంతగా ఫెమస్ అయ్యిందో చెబుతున్నాడు. 

అయితే తన షాప్ కి రిపీటెడ్ కష్టమర్స్ వస్తున్నారు. కావాలంటే ఒకరోజంతా కెమెరా ఇక్కడే పెట్టుకుని చూసుకోండి అంటూ ఆర్పీ యూట్యూబ్ ఛానల్స్ కి సవాల్ విసిరాడు. అయినప్పటికీ.. ప్రస్తుతం కొద్దిరోజులుగా ఆర్పీ చేపలపులుసు యూట్యూబ్ ఛానల్స్ లో పెద్దగా కనిపించడం లేదు, ఆర్పీ హంగామా వినిపించడం లేదు.

RP doesn't seem to be in a rush:

Kiraak RP Curry Point
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs