తెలుగు నిర్మాత దిల్ రాజు కోలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు ని తెలుగు, తమిళంలో భారీగా తెరకెక్కించాడు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తెలుగు నిర్మాత దిల్ రాజు అంటే సినిమా చాలావరకు తెలుగుకే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కానీ స్టార్ హీరో కోలీవుడ్ నుండి వచ్చాడు కాబట్టి, హీరో ఎలా చెబితే అలా, ఎంత చెబితే అంత అన్నట్టుగా.. వారసుడు ప్రమోషన్స్ కి కనీసం విజయ్ తెలుగులో కనిపించింది లేదు. దిల్ రాజు, దర్శకుడు, తెలుగు నటుడు శ్రీకాంత్ ప్రమోషన్స్ తప్ప హీరోయిన్ రష్మిక కూడా తెలుగుకి వచ్చి వారసుడిని ప్రమోట్ చెయ్యనే లేదు.
ఇప్పుడు ధనుష్ కూడా సార్ విషయంలో అలానే చేస్తాడా అనే డౌట్ కొడుతోంది. ఎందుకంటే తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ సార్ సినిమాని నిర్మిస్తున్నాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 17 సార్ రిలీజ్ అని చెప్పారు. ఇంతవరకు తెలుగులో సార్ ప్రమోషన్స్ మొదలు కాలేదు. తమిళంలో సార్ ఆడియో లంచ్ వేడుక మాత్రం గ్రాండ్ గా చేస్తున్నారు. మరి విజయ్ మాదిరిగా ధనుష్ కూడా స్టార్ హీరోనే. తెలుగులో బెటర్ మార్కెట్ ఉన్నవాడే. ధనుష్ కూడా విజయ్ లా తెలుగు ప్రేక్షకుల ముందుకు సార్ ప్రమోషన్స్ కి వస్తాడా.. హ్యాండ్ ఇస్తాడా.. అనేది అందరిలో ఉన్న అనుమానం.
పెద్ద నిర్మాత దిల్ రాజే విజయ్ రాకపోతే ఏం చెయ్యలేకపోయాడు. ఇప్పడు నాగ వంశీ మాత్రం ధనుష్ రాకపోయినా ఏం చెయ్యగలడు. గట్టిగా చెప్పలేరు. ఒక్కసారి వచ్చి సర్ ని ప్రమోట్ చేస్తే సినిమాపై తెలుగులో డెఫనెట్ గా అంచనాలు పెరుగుతాయి. లేదంటే వారసుడు మాదిరి డబ్బింగ్ సినిమాగా సార్ కూడా మిగిలిపోతుంది.