యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల మూవీ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. ఈమధ్యనే కళ్యాణ్ రామ్ తో కలిసి తారకరత్నని చూసేందుకు బెంగుళూర్ వచ్చినప్పుడు రఫ్ గా గెడ్డం పెంచి హ్యాండ్ సమ్ గా కనబడిన ఎన్టీఆర్ ని NTR30 ఎప్పుడు మొదలవుతుందో మీడియా అడగలేకపోయింది. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో గత వారం రోజులుగా హడావిడి చేస్తున్నారు. NTR30 నిర్మాణ సంస్థలైన యువ సుధా ఆర్ట్స్ వారిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారిని సోషల్ మీడియా వేదికగా ఏసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నాడు.
కర్నూల్ లో జరిగిన అమిగోస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు వస్తున్నాడని చెప్పగానే ఎన్టీఆర్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో NTR30 పై అప్ డేట్ ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. బింబిసారా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి.. అది అంతకుమించి ఉండాలనే ఉద్దేశ్యంతో NTR30 స్క్రిప్ట్ రెడీ అవుతుంది. సో కొద్దిగా ఆలస్యమవుతుంది అంటూ చెప్పాడు. కానీ ఎన్టీఆర్ బింబిసారా ఈవెంట్ లో NTR30 పై ఎలాంటి కామెంట్స్ చెయ్యకపోయినా.. ఇప్పుడు అమిగోస్ ఈవెంట్ లో ఖచ్చితంగా NTR30 షూట్ మొదలయ్యే అప్ డేట్ ఇస్తారు, NTR30 పై ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ ఉన్నారు.
ఈ నెలలో ఖచ్చితంగా NTR30 సెట్స్ మీదకి వెళుతుంది. రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అని గత నెలలో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. కానీ దానికి సంబందించిన హడావిడి లేకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ కి మెంటలెక్కిపొతుంది.