Advertisement
Google Ads BL

పవన్ కి-ఆలీకి మధ్య జరిగింది అదే: నాగబాబు


సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్-అలీ మంచి స్నేహితులు.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీకి ఓ ఇంపార్టెంట్ రోల్ గ్యారెంటీ అన్న రేంజ్ లో వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారిన పవన్ కళ్యాణ్-ఆలీకి మధ్యన బాగా గ్యాప్ వచ్చేసింది అనే ప్రచారం ఉంది. అందుకే అలీ పిలిచినా ఆయన కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరవలేదు అంటారు. కానీ అలీ మాత్రం మా మధ్యన ఎలాంటి గ్యాప్ లేదు, అదంతా మీరు సృష్టించిందే అంటాడు.. అంతలోనే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ పై పోటికి సై అంటాడు. అసలు వీళ్ళ మధ్యలో ఏం ఉంది, గొడవలు ఉన్నాయా.. పవన్ ఏమైనా అలీని లైట్ తీసుకుంటున్నాడా అనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు.

Advertisement
CJ Advs

తాజాగా ఈ విషయమై నాగబాబుని కదిపితే.. పవన్ కళ్యాణ్-అలీ మంచి స్నేహితులు. కానీ రాజకీయాలన్నాక, ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఏవేవో మాటలు పడాలి, అనాలి. కాదు అలీ పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తాను అంటున్నాడు అని అడిగితే.. పార్టీలో చేరాక ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి.. అది అతని తప్పు కాదు అని తేల్చేసాడు నాగబాబు. అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని అడిగితే.. నా ముందే అలీ వచ్చి కళ్యాణ్ బాబుకి కార్డు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించి వెళ్ళాడు. మరెందుకు వెళ్ళలేదు అని అడిగితే.. కళ్యాణ్ బాబు పార్టీ పనులతో మంగళగిరిలో ఉన్నాడు.. కాబట్టే వెళ్లలేకపోయాడంటూ నాగబాబు.. పవన్ కి అలీ మధ్యన జరిగిందేమిటో బయటపెట్టాడు.

Same thing happened between Pawan-Ali: Nagababu:

Nagababu about Pawan Kalyan and Ali Relation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs